Shreyas Iyer : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. ప్రతి నెలా ఈ కేటగిరీ కింద పురస్కారాన్ని వెల్లడిస్తుంది.
ఆయా నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటుంది ఐసీసీ. ఈ మేరకు ఐసీసీ అవార్డుల ఎంపిక కమిటీ సమావేశమై అటు బౌలింగగ్ లో ఇటు బ్యాటింగ్ లో , ఆల్ రౌండర్ కేటగిరీలలో అత్యుత్తమ ప్రదర్శన చేపట్టిన క్రికెటర్ల జాబితాను తయారు చేస్తుంది.
వారిలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను వచ్చిన పాయింట్ల ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు పరిగణలోకి తీసుకుంటుంది. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది అవార్డుకు భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది ఐసీసీ.
ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది ఐసీసీ. ఇదిలా ఉండగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సీరీస్ లో మనోడు అద్భుతంగా ఆడాడు.
ఇందులో భాగంగానే అయ్యర్ ను ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఐసీసీ వివరించింది. ఈ సీరీస్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఇక వరల్డ్ వైడ్ గా టీ20 ర్యాంకింగ్స్ లో 27వ స్థానంలో ఉన్న అయ్యర్ 18వ ప్లేస్ కు చేరుకున్నాడు. అయితే టెస్టు మ్యాచ్ లలో సైతం సత్తా చాటాడు మనోడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ టీమిండియాలో కీలకంగా మారాడు.
Also Read : అమేలియాకు ఐసీసీ అవార్డు