Jack Dorsey Comment : ఉక్కుపాదం వివాదాస్పదం
మోదీ ప్రభుత్వంపై డోర్సీ కన్నెర్ర
Jack Dorsey Comment : సామాజిక మాధ్యమాలలో టాప్ లో కొనసాగుతున్న ట్విట్టర్ కు ప్రాణం పోసింది ఎవరు అంటే ఠక్కున చెప్పేస్తారు జాక్ డోర్సీ. ఆయన కలల పంట. ఒకనాడు చిన్నగా మొదలైన ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థ ఏకంగా కోట్లాది మందిని ఏకం చేసింది. ఉద్యమాలకు, పోరాటాలకు, ఆరాటాలకు, ఆలోచనలకు, అభిప్రాయాలకు, అనుబంధాలకు, సంఘటనలకు , కన్నీళ్లకు వేదికగా మారింది. కానీ ఉన్నట్టుండి ట్విట్టర్ నుంచి వైదొలిగాడు జాక్ డోర్సీ. వెళ్లిపోతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రవాస భారతీయుడు దాని పగ్గాలు చేపట్టినా చివరకు ప్రముఖ బిలీయనీర్ టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లి పోయింది. ఇది పక్కన పెడితే ట్విట్టర్ మాజీ సిఇవో జాక్ డోర్సీని పక్కన పెడితే సంస్థ నుంచి వైదొలిగాక ఊరికే ఉన్నాడని అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే కలల్ని నిజం చేసేందుకు మరో సంస్థకు ప్రాణ ప్రతిష్ట పని చేసే పనిలో పడ్డాడు.
ఈ తరుణంలో సంచలనంగా మారారు జాక్ డోర్సీ. ఏకంగా మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం అన్నది బక్వాస్ అంటూ పేర్కొన్నాడు. ఆపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాక్ డోర్సీ(Jack Dorsey) చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ట్విట్టర్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు, సమాచారాన్ని నిలిపి వేయాలని మోదీ ప్రభుత్వం ఆదేశించిందంటూ ఆరోపించారు ట్విట్టర్ మాజీ సిఇవో. వినిపించుకోక పోతే చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.
డోర్సీ చెప్పింది అక్షరాల వాస్తవం అంటూ సంచలన ప్రకటన చేశారు భారతీయ కిసాయన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, ఎస్కేయూ అగ్ర నేత రాకేశ్ టికాయత్. తమ ఆందోళన సమయంలో ట్విట్టర్, ఫేస్ బుక్, ఇతర సామాజిక సంస్థలు ఆశించిన మేర తమకు మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. మాజీ సిఇవో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆప్ , కాంగ్రెస్ భారత దేశానికి బేషరతుగా మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇదిలా ఉండగా జాక్ డోర్సీ(Jack Dorsey) చేసిన వ్యాఖ్యలు సత్య దూరమని, ఎన్నికలు వచ్చే కంటే ముందు విదేశీ సంస్థలు పనిగట్టుకుని భారత దేశంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేయడం మామూలేనని పేర్కొంది బీజేపీ. మొత్తంగా ఉక్కుపాదం ఇంకెంత కాలం అంటున్నారు మేధావులు. చైతన్య వంతమైన ప్రజలు.
Also Read : Lord Malayappa Swamy : కెనడాలో ఘనంగా శ్రీవారి కళ్యాణం