Jagadish Shettar : లింగాయత్ లను పట్టించుకోని బీజేపీ
మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ కామెట్స్
Jagadish Shettar : భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కర్ణాటక సీఎం జగదీశ్ షెట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన లింగాయత్ సామాజిక వర్గాన్ని కావాలని పక్కన పెట్టిందని ఆరోపించారు. మంగళవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
దీనికంతటికి ప్రధాన కారణం పార్టీకి చెందిన బీఎల్ సంతోష్ అని సంచలన ఆరోపణలు చేశారు జగదీశ్ షెట్టర్(Jagadish Shettar). ఇవాళ పార్టీ కోసం పని చేసిన తనను పక్కన పెట్టారని, ఆత్మ గౌరవం ఉన్న వాళ్లు ఎవరూ బీజేపీలో ఉండరని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలో లింగాయత్ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. వాళ్లు ఎవరికి మద్దతు ఇస్తే వారే పవర్ లోకి వస్తారని ఇది చరిత్ర చెప్పిన సత్యమన్నారు. బీఎల్ సంతోష్ అంతా తానై వ్యవహరించారని ఇక్కడ సర్కార్ ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆయన వ్యవహార శైలి పార్టీని నాశనం చేసిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు జగదీశ్ షెట్టర్(Jagadish Shettar).
Also Read : బీజేపీలోకి వెళ్లను ఎన్సీపీ తోనే ఉంటా