Jagdeep Dhankhar : రాజ్యసభ చైర్మన్ ‘జగదీప్ దన్ ఖడ్’ పై ‘ఇండియా’ కూటమి అవిశ్వాస తీర్మాన నోటీసులు
పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన నిరసనల్లోనూ పాల్గొనలేదు..
Jagdeep Dhankhar : పార్లమెంటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ పై విపక్ష ‘ఇండియా’ కూటమి అవిశ్వాస తీర్మానానికి సోమవారంనాడు నోటీసు ఇచ్చింది. ఈ తీర్మానంపై 71 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలిసింది. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా ఇండియా కూటమి పార్టీలు దీనిపై సంతకాలు చేశాయి. ఈ రెండు పార్టీలు అదానీ అంశంపై కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నాయి. పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన నిరసనల్లోనూ పాల్గొనలేదు. కాగా, ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభించడం సాంకేతికంగా సాధ్యం కాదని, 14 రోజుల నోటీస్ పీరియడ్ ఉండాలని, శీతాకాల సమావేశాలు ముగియడానికి ఇప్పుడు కేవలం 8 రోజులే ఉన్నాయని చెబుతున్నారు.
Jagdeep Dhankhar..
సభను సజావుగా సాగనీయకుండా అడ్డుకుంటున్నారంటూ జగ్‌దీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) విపక్ష కూటమి నేతలను తరచు సభాసమావేశాల్లో మందలిస్తున్నారు. అయితే, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ విపక్షాల పట్ల ధన్‌ఖడ్ వివక్ష చూపుతున్నారని, తమకు మాట్లేడేందుకు సమయం ఇవ్వడం లేదని, అడుగడుగునా తమను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి 50 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా, 70 మంది ఎంపీలు తమకు మద్దతుగా సంతకాలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
మరోవైపు,పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష నేతలు మంగళవారంనాడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ క్యారీక్యాచర్లు ఉన్న వినూత్నమైన బ్యాగులు ధరించి పార్లమెంటు వెలుపల వీరు నిరసనకు దిగారు. సోమవారం సైతం ప్రధాని మోదీ, అదానీల ముఖం మాస్కులను కొందరు ధరించి పార్లమెంటు ముఖద్వారం వెలుపల నిరసన జరిపారు. వీరితో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ నిర్వహించారు.
Also Read : Vundavalli Arun Kumar : ఏపీ డిప్యూటీ సీఎంకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ