Jairam Ramesh Jai Shankar : ఇలా ఎంత కాలం మభ్య పెడతారు
కేంద్ర సర్కార్ పై కాంగ్రెస్ సెటైర్
Jairam Ramesh Jai Shankar : భారత భూభాగాన్ని చైనా ఆక్రమించు కునేందుకు యత్నిస్తున్నా దానిని ఎందుకు మభ్య పెడుతున్నారంటూ కేంద్ర సర్కార్ పై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇందుకు పార్టీ కొత్త పేరు పెట్టింది. అదేమిటంటే తిరస్కరించడం, దృష్టి మరల్చడం, అబద్దం, సమర్థించడం. దీనికి ఇంకో పేరు డీడీఎల్జే..ఇదేదో హిందీ సినిమా పేరు మత్రం కాదని పేర్కొంది.
అతి పెద్ద ప్రాదేశిక పరాభావాన్ని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వాస్తవాన్ని ఎలాంటి మభ్య పెట్టినా దాచ లేమని నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ చిలుక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేసింది.
కేంద్రం అనుసరిస్తున్న విఫలమైన చైనా విధానం నుండి దృష్టి మరల్చేందుకు సుబ్రమణ్య జై శంకర్ ప్రయత్నించారని ఆరోపించింది. ఇదిలా ఉండగా జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రెడీ అయ్యాయి. ఇది పూర్తిగా కప్పదాటు ధోరణి తప్ప ఇంకొకటి కాదన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్ ఛార్జ్ జైరామ్ రమేష్(Jairam Ramesh).
చైనా చీఫ్ జిన్ పింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రలోభ పెట్టాలని చూశారు. కానీ చైనా తనతో చర్చలు జరిపాక మరింత దూకుడు పెంచిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డెప్సాంగ్ , డెమ్ చోక్ వద్ద చైనీస్ దళాలు మోహరించాయని ముందు వాటిని తొలగించేదుకు ప్రయత్నం చేయాలని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.
Also Read : భారీ హిమపాతం యాత్రకు అంతరాయం