James Cameroon SS Raja Mouli : జ‌క్క‌న్న‌కు జేమ్స్ కితాబు

ఆలోచ‌న ఉంటే హాలీవుడ్ లో చేద్దాం

James Cameroon SS Raja Mouli : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో ఐకాన్ గా మారి పోయారు. ప్ర‌పంచం మెచ్చిన ద‌ర్శ‌కుడు హాలీవు డ్ కు చెందిన జేమ్స్ కామెరూన్ ఏకంగా జ‌క్క‌న్న‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. ఆయ‌న తీసిన ర‌ణం..రుధిరం..రౌద్రం (ఆర్ఆర్ఆర్) మూవీ ఇప్ప‌టికే ప‌లు అవార్డులు కొల్ల‌గొట్టింది.

ఎన్నో పుర‌స్కారాలు అందుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి మూవీ మేకింగ్ పై..ప్ర‌త్యేకించి జ‌క్క‌న్న టేకింగ్ గురించి. హాలీవుడ్ లో ఇప్పుడు రాజ‌మౌళి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఈ త‌రుణంలో తాను తీసిన ఆర్ఆర్ఆర్ మూవీని టాప్ డైరెక్ట‌ర్ జేమ్స్ కామ‌రూన్(James Cameroon) చూశారు.

రెండోసారి కూడా త‌న భార్య‌తో క‌లిసి వీక్షించారు. ఎస్ఎస్ రాజమౌళిని ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. ఆపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బాగుంద‌ని కొనియాడారు. ఆపై ఏమైనా ఆలోచ‌న ఉంటే గ‌నుక హాలీవుడ్ లో క‌లిసి సినిమా చేద్దామంటూ ఆఫ‌ర్ కూడా ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఈ మేర‌కు ఈ కీల‌క విష‌యాన్ని ఆర్ఆర్ఆర్ టీం స్పెష‌ల్ గా పంచుకుంది ట్విట్ట‌ర్ వేదిక‌గా. ఇది ఇలా ఉండ‌గా రాజ‌మౌళి జేమ్స్ కామ‌రూన్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను మీరు తీసిన టెర్మినేట‌ర్ , టైటానిక్, అవ‌తార్ లాంటి సినిమాలు చూశాన‌ని తాను తీసేందుకు మీరే ఇన్సిపిరేష‌న్ అని చెప్పారు కామ‌రూన్ కు.

మీరు స్టోరీ చెప్పే విధానం న‌న్ను ఆక‌ట్టుకుంది. చాలా సంతోషం క‌లిగించింద‌ని పేర్కొన్నారు జ‌క్క‌న్న‌కు . దీంతో ప్ర‌పంచం మెచ్చిన ద‌ర్శ‌కుడు త‌న‌ను ప్ర‌శంసించ‌డంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నాడు జ‌క్క‌న్న‌.

Also Read : 25న నోరా ఫ‌తేహీ దావా విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!