Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్, కథువా జిల్లాలో అగ్ని ప్రమాదంలో ఊపిరాడక ఆరుగురు మృతి

పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను ఆర్పి....

Jammu and Kashmir : జమ్ము కాశ్మీర్‌లోని కథువా(Kathua) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారని పోలీసులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గమనించారు. దీంతో వారు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.

Jammu and Kashmir….

పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను ఆర్పి.. ఆ ఇంట్లోని వారిని కథువా(Kathua)లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు మరణించారని వైద్యులు వెల్లడించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం కారణంగా.. వీరంతా ఊపిరాడక మరణించారని వారు చెప్పారు. ఇదే విషయం తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిద్రిస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని.. దీంతో వారంతా ఊపిరాడక మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. మరో వైపు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేకుంటే ఉద్దేశ పూర్వకంగా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఆ ఇంటిని పోలీసులు పరిశీలించారు.

ఇంకోవైపు కథువా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ కే అత్రి మాట్లాడుతూ.. రిటైర్డ్అసిస్టెంట్ మేట్రన్ నివస్తున్న అద్దె ఇంట్లో మంటలు చెలరేగాయని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం10 మందిని పోలీసులు ఆసుపత్రికి తీసుకు వచ్చారన్నారు. వారిలో ఆరుగురు అప్పటికే మరణించారని చెప్పారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు.మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించాల్సి ఉందన్నారు. అనంతరం వాటిని పోలీసులకు అందజేస్తామని వివరించారు.

Also Read : Minister Kollu Ravindra : పేర్ని నాని బియ్యం కుంభకోణంపై భగ్గుమన్న మంత్రి కొల్లు రవీంద్ర

Leave A Reply

Your Email Id will not be published!