Jammu Kashmir Police : రాహుల్ గాంధీ ఆరోపణలు అబద్దం
జమ్మూ కాశ్మీర్ పోలీస్ ప్రకటన
Jammu Kashmir Police : భారత్ జోడో యాత్ర సందర్భంగా భారీ భద్రతను కొనసాగిస్తున్నామని జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పష్టం చేసింది. భద్రతా వైఫల్యం కారణంగా 20 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాల్సి ఉండగా అర్ధాంతరంగా పాదయాత్రను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు రాహుల్ గాంధీ సైతం సెక్యూరిటీ లోపం వల్లే తాము యాత్రను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
దీనిపై సీరియస్ గా స్పందించింది జమ్మూ కాశ్మీర్ పోలీస్ . ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఎలాంటి వైఫల్యం లేదని, భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొంది. ఎక్కడా కించిత్ లోపం లేదని, పూర్తి భద్రతను కల్పించడం జరిగిందని వెల్లడించింది జమ్మూ కాశ్మీర్ పోలీస్(Jammu Kashmir Police).
అసలు పాదయాత్రను ఎందుకు నిలిపి వేస్తున్నారనే దానిపై తమకు తెలియ చేయలేదని తెలిపింది. పాదయాత్రను నిలిపి వేసే ముందు తమకు తెలియ చేయాల్సి ఉంటుంది. కానీ దానిని నిర్వాహకులు పాటించ లేదని, దీనికి కూడా తమపై నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి తాము ఎవరెవరిని సెక్యూరిటీకి వినియోగించామనే దానిపై పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. నిర్వాహకులు ఎక్కువ సంఖ్యలో జనం వస్తారని ముందే తమకు తెలియ చేయలేదని ఆరోపించింది జమ్మూ కాశ్మీర్ పోలీస్.
Also Read : ద్వేషం నశించాలి ప్రేమ వర్దిల్లాలి