Jasprit Bumrah : రోహిత్ శర్మ ప్లేస్ లో కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా..
హిట్‌మ్యాన్ సతీమణి రితికా త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వనుందని....
Jasprit Bumrah : న్యూజిలాండ్ చేతుల్లో దారుణ ఓటమితో అభిమానులే కాదు భారత జట్టు ఆటగాళ్లు కూడా నిరాశలో కూరుకుపోయారు. సొంతగడ్డపై ఇలాంటి పరాభవాన్ని ఎవరూ ఊహించలేదు. ఈ ఓటమితో తదుపరి ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నెగ్గడం మెన్ ఇన్ బ్లూకు తప్పనిసరిగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో కంగారూలను భారత్ చిత్తు చేయాల్సిందే. ఈ తరుణంలో అనూహ్యంగా టీమిండియా కెప్టెన్సీ మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు బదులు స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్య పగ్గాలు తీసుకోనుండటంపై డిస్కషన్స్ ఊపందుకున్నాయి.
Jasprit Bumrah As a..
కివీస్తోచివరి టెస్ట్ ముగిశాక రోహిత్ మాట్లాడుతూ ఆసీస్ సిరీస్‌లోని తొలి మ్యాచులో తాను ఆడటం కష్టమేనని అన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ మ్యాచ్‌కు అతడు దూరమవనున్నట్లు తెలుస్తోంది.హిట్‌మ్యాన్ సతీమణి రితికా త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వనుందని.. అందుకే అతడు మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. రితికా బేబీ బంప్ అంటూ నెట్టింట కొన్ని ఫొటోలు వైరల్ అవుతుండటం దీనికి మరింత ఊతమిస్తోంది. అయితే ఈ దంపతులు మాత్రం దీనిపై అప్డేట్ ఇవ్వలేదు. ఇక, రోహిత్ గైర్హాజరీలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపించనున్నాడని తెలుస్తోంది.బుమ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తారని.. రోహిత్ రాకపోతే పూర్తి సిరీస్‌కు అతడే కెప్టెన్‌గా ఉంటాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
మాజీకెప్టెన్ విరాట్ కోహ్లీ సహా లిమిటెడ్ ఓవర్స్ వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో సారథ్యానికి ప్రత్యామ్నాయాలు ఉన్నా బుమ్రాకే టీమ్ పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. హిట్‌మ్యాన్ కెరీర్ చరమాంకంలో ఉన్నందున టెస్టుల్లో అతడి వారసుడిగా బుమ్రాను సిద్ధం చేయడానికి ఇదే సరైన సమయమని బోర్డు పెద్దలు అనుకుంటున్నారట. అందుకే కోహ్లీ, గిల్‌ను కాదని టీమ్‌ను లీడ్ చేసే ఛాన్స్ అతడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Sharad Pawar : ఎన్నికల్లో పోటీపై కీలక అంశాలను వెల్లడించిన శరద్ పవార్