Jasprit Bumrah : లారా రికార్డ్ బద్దలు కొట్టిన బుమ్రా
ఒకే ఓవర్ లో 29 రన్స్ ..4 ఫోర్లు 2 సిక్సర్లు
Jasprit Bumrah : న్యూజిలాండ్ ను స్వదేశంలో మట్టి కరిపించిన ఇంగ్లండ్ సేనకు చుక్కలు చూపించింది భారత జట్టు. ప్రధానంగా రోహిత్ శర్మ కరోనా కారణంగా తప్పు కోవడంతో అనుకోకుండా కపిల్ దేవ్ , కుంబ్లే తర్వాత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు(Jasprit Bumrah) నాయకత్వం వహించే అవకాశం దక్కింది.
ఒక రకంగా చెప్పాలంటే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రపంచంలో ఏ దేశ క్రికెట్ బోర్డు చేయని సాహసం చేసింది. ఇప్పటి వరకు ఏడుగురు కెప్టెన్లను మార్చింది.
ఆడకుండా మిగిలి పోయిన రీ షెడ్యూల్ 5వ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ కు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, పుజారా, హనుమ విహారీ విఫలమైనా రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా శతకాలతో మోత మోగించారు.
ఇక స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఎంపికైన బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా గతంలో టెస్టు క్రికెట్ చరిత్రలో విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా సాధించిన రికార్డును చెరిపేశాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ ను బుమ్రా(Jasprit Bumrah) చితక బాదాడు.
ఒకే ఓవర్ లో 29 పరుగులు చేశాడు. ఇక టెస్టు క్రికెట్ లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉండగా ఈ రికార్డు 18 ఏళ్ల పాటు అలాగే ఉంది.
2003-2004లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో లారా రాబిన్ పీటర్సన్ బౌలింగ్ లో 28 పరుగులు చేశాడు. ఆ రికార్డును బుమ్రా ఒక పరుగు ఆధిక్యంతో చెరిపేశాడు. ఈ పరుగుల్లో బుమ్రా 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : పంత్ పరాక్రమం భారత్ పటిష్టం