Jawan SRK : షారుక్ ఖాన్ జ‌వాన్ వైర‌ల్

సినీ కెరీర్ లో బిగ్ హిట్ మూవీ

Jawan SRK : బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు పొందిన షారుక్ ఖాన్ ,న‌య‌న‌తార క‌లిసి న‌టించిన జ‌వాన్(Jawan) దుమ్ము రేపుతోంది. త‌మిళ‌నాడులో దిగ్గ‌జ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ఈ చిత్రాన్ని. సుమిత్ అరోరా ఈ చిత్రానికి డైలాగులు అందించారు. గౌరీ ఖాన్ నిర్మించారు. రూ. 220 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో జ‌వాన్ ను రూపొందించాడు డైరెక్ట‌ర్.

Jawan SRK Updates

ఇందులో న‌య‌న తార‌తో పాటు విజ‌య్ సేతుప‌తి న‌టించారు. జికె విష్ణు సినిమాటోగ్ర‌ఫీ అందించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్ స‌మ‌ర్పించింది ఈ చిత్రాన్ని. దీనిని యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్. ప్రియ‌మ‌ణి, స‌న్యా మ‌ల్హోత్రా తో పాటు షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభిన‌యం చేశారు.

సెప్టెంబ‌ర్ 2021లో పూణె, ముంబై, హైద‌రాబాద్, చెన్నై, రాజ‌స్థాన్ , ఔరంగాబాద్ ల‌లో చిత్రీక‌రించారు ఈ జ‌వాన్ చిత్రాన్ని. రూబెన్ ఎడిటింగ్ నిర్వ‌హించారు. అట్లీ అంటే న‌మ్మ‌కం, అంత‌కంటే భ‌రోసా. అందుకే తాను అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు తాను అంగీకారం తెలిపాన‌ని స్ప‌ష్టం చేశారు న‌టుడు షారుక్ ఖాన్.

Also Read : Gunturu Kaaram Update : గుంటూరు కారం అప్ డేట్ – త్రివిక్ర‌మ్

Leave A Reply

Your Email Id will not be published!