Jay Shah Ganguly : సౌరవ్ గంగూలీ ట్వీట్ కలకలం
వివరణ ఇచ్చిన కార్యదర్శి జే షా
Jay Shah Ganguly : తాను కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటున్నానని అంటూ బుధవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాస్ , మాజీ భారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Ganguly) ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపింది. క్రికెట్ వర్గాలను విస్మయ పరిచేలా చేయగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ పై బీసీసీఐ కార్యదర్శి జే షా(Jay Shah) వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సౌరవ్ గంగూలీ మోస్ట్ పాపులర్ కలిగిన వ్యక్తి. దాదా తన క్రికెట్ కెరీర్ ప్రారంభించి ఈ ఏడాది తో 30 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆయన సమాజానికి ఏదో ఒకటి కొత్తగా చేయాలని ఆలోచించారు.
దానినే స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు జే షా. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగితే ఊహాగానాలకు దారి తీసింది గంగూలీ చేసిన ట్వీట్.
ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థల్లో బీసీసీఐ ఒకటి. దానికి 2019లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు ఈ భారత జట్టు మాజీ కెప్టెన్ గంగూలీ.
ఆయన బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదంటూ కార్యదర్శి జే షా(Jay Shah) స్పష్టం చేశారు. క్రికెట్ లో తన ప్రయాణం సాగించి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు సౌరవ్ గంగూలీ(Jay Shah Ganguly) ట్వీట్ చేశారంటూ తెలిపారు.
ఏదైనా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నానని పేర్కొన్నారు దాదా. బహుషా ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మందికి సహాయం చేస్తుందని తెలిపాడు జే షా.
Also Read : నిఖత్ జరీన్..ఇషా సింగ్ కు నజరానా