Jay Shah BCCI : టీమిండియాపై జే షా ముద్ర

బీసీసీఐకి అత‌డే కింగ్ మేక‌ర్

Jay Shah BCCI : కేంద్రంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఉన్నా ప్ర‌స్తుతం న‌డిపేదంతా కేంద్ర హోం శాఖ మంత్రి , ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ షానే. ఆయ‌న సుపుత్రుడు జే షా ఇప్పుడు బీసీసీఐ(Jay Shah BCCI) కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. బీసీసీఐ పూర్తిగా పొలిటిక‌ల్ ప‌వ‌ర్ కు సెంట‌ర్ గా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

రాజీవ్ శుక్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి కాగా మిగ‌తా వారంతా బీజేపీకి చెందిన వారు కావ‌డం విశేషం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోద‌రుడు ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కు చైర్మ‌న్ గా ఉన్నాడు. ఇదంతా ప‌క్క‌న పెడితే ఎప్పుడైతే బీజేపీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిందో మెల మెల్ల‌గా త‌మ వారిని అన్ని రంగాల‌లో ప‌వ‌ర్ పుల్ పోస్టుల‌లో ఉండేలా చేస్తూ వ‌చ్చింది. ఓ వైపు వార‌సుల‌కు ప‌ద‌వులు ఉండ కూడ‌ద‌ని మోదీ చిలుక ప‌లుకులు పలుకుతున్నా వార‌సులే ఇప్పుడు టాప్ పొజిష‌న్ల‌లో కొన‌సాగుతున్నారు. 

ఇక వేల కోట్ల ఆదాయం క‌లిగిన బీసీసీఐ ఇప్పుడు జే షా చేతిలో ఉంది. బీసీసీఐకి రోజ‌ర్ బిన్నీ అధ్యక్షుడిగా ఉన్నా మొత్తం చ‌క్రం తిప్పేదంతా జే షానే. ఆయ‌న ఏం చెబితే అదే వేదం. ఇప్పుడు ర‌బ్బ‌ర్ స్టాంప్ లాగా మారి పోయాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పుడు జే షా(Jay Shah BCCI) అనుకుంటే భార‌త జ‌ట్టులో ఎవ‌రైనా ఎంపిక కాగ‌ల‌రు. 

అంతెందుకు రిష‌బ్ పంత్ , కేఎల్ రాహుల్ వ‌రుస‌గా ఫెయిల్ అవుతూనే ఉన్నా కంటిన్యూగా టెస్టు, వ‌న్డే, టి20 ఫార్మాట్ ల‌లో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. గాయం కార‌ణంగా చికిత్స పొందుతున్న పంత్ ఒక వేళ కోలుకుంటే వెంట‌నే ఎంపిక‌య్యేవాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్నా సంజూ శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టారు. బీసీసీఐ అనుస‌రిస్తున్న విధానంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Also Read : ఆసిస్ తో భార‌త్ వ‌న్డే టీమ్ డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!