Jay Shetty Quotes : సన్యాసిలా ఆలోచిస్తే జీవితం సంతోషం
ప్రముఖ లైఫ్ కోచ్ ..రచయిత జే శెట్టి
Jay Shetty Quotes : భారత దేశానికి చెందిన వక్తలలో మోస్ట్ పాపులర్ లైఫ్ కోచ్ , రైటర్ ఎవరైనా ఉన్నారంటే అతడి పేరు ఠక్కున చెప్పేస్తారు తెలిసిన వారు ఎవరైనా. ఆయన తన పుస్తకంలో ఆసక్తికరమైన విషయాలు రాశారు. ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. జే శెట్టి రాసిన థింక్ లైక్ ఏ మాంక్ పుస్తకం ఇప్పుడు ప్రపంచ పుస్తకాలలో ఎన్నదగినదిగా మారి పోయింది. ఇందులో ఆయన పేర్కొన్నది ప్రధానమైది ఏమిటంటే..జీవితంలో ఆనందం కావాలంటే ఏం చేయాలి. ముందుగా సన్యాసిలా ఆలోచిస్తే సంతోషం వస్తుందంటారు.
ఆయన రాసిన పుస్తకం నుండి ఎన్నో ముఖ్యమైనవి ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు అవసరం అవుతాయి. వాటిలో మీ మనస్సును మీరు నియంత్రణలో పెట్టుకోండి. అది కోతి లాంటిది. దానిని ఎప్పుడూ నియంత్రిస్తూ..పరికిస్తూ ఉండాలని సూచిస్తారు జే శెట్టి(Jay Shetty Quotes). ఆనందం కంటే అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయాలంటారు రచయిత. మీ నిజ స్వరూపాన్ని కనుక్కోండి. ఎందుకంటే మీకు మీరే ముఖ్యం. మీరు ఇతరులు అనుకున్నట్లు మీరు కానే కాదు. మీ జీవితాన్ని వేరొకరిలా బతకడం మానేయండి.
అలా చేస్తే మీ నుంచి మీరు కాకుండా పోతారంటారు జే శెట్టి. ప్రామాణికమైన జీవితాన్ని గడిపేందుకు ఇబ్బంది ఏర్పడుతుందని హెచ్చరించారు. ప్రతి రోజు చివరిలో భావోద్వేగాలు, నిర్ణయాలను బేరీజు వేసుకోవాలని సూచిస్తాడు జే శెట్టి. ఇతరులను అంచనా వేయడం మానేయండి అంటారు. ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దంటాడు. ఇతరువల విలువల ద్వారా మిమ్మల్ని మీరు ఎంతగా నిర్వచించుకుంటే మీరు అంతగా నష్ట పోతారని హెచ్చరిస్తాడు జే శెట్టి.
నిజమైన జీవితాన్ని గడిపేందుకు , సరిపోయే విలువలను మాత్రమే కనుకొనాలని , వాటి ప్రకారం జీవించేందుకు ప్రయత్నం చేయాలని అంటాడు. మీరు ఖాళీ చేసే సమయంలో చేసే పనులు మీరు విలువైన వాటి గురించి చాలా చెబుతాయి. కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వండి లేక పోతే చాలా నష్ట పోతారని హెచ్చరిస్తాడు జే శెట్టి(Jay Shetty Quotes).
మీరు సంఘంలో భాగం. సంఘం బాగుంటే యావత్ ప్రపంచం బాగుంటుందని అంటాడు. కాలం విలువైనది. అందరి సమస్యలకు మీరు బాధ్యులు కారు. మీకు ఈత రాక పోతే మునిగి పోతున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించవద్దని సూచిస్తాడు సున్నితంగా .
మీరు సాధించిన విజయంతో పాటు ఇతరులు సాధించిన గెలుపులోనూ ఆనందాన్ని కనుగొనడం నేర్చుకోవాలని పేర్కొంటాడు జే శెట్టి. సాధనపై ఫోకస్ పెట్టండి. ఫలితాలను కోల్పోవడానికి మిమ్మల్ని ఏ మాత్రం అనుమతించకండి . చివరగా మీ స్వంత అంత్యక్రియలలో మీరు ఎలా గుర్తింప బడాలని అనుకుంటున్నారో ఇప్పుడే ఊహించుకోండి.
ఎందుకంటే మీరు సాధించినవి ఏవీ మీకు లభించవు. ఉన్నప్పుడే జీవించడం నేర్చుకోండి అంటాడు జే శెట్టి. సో వీలైతే వినండి..జే శెట్టి రాసినవి చదవండి..సమయం చిక్కితే కలవండి. ఆనందం పొందండి.
Also Read : భారతీయ సంస్కృతి మాయా ప్రపంచం