Jaya Hey 2.0 Patriotic Song : ఆకట్టుకున్న ‘జయ హే 2.0’ గీతం
పాల్గొన్న 75 మంది కళాకారులు
Jaya Hey 2.0 Patriotic Song : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు పీఎం నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ప్రదర్శించిన జాతీయ గీతం ఆకట్టుకుంది.
75 మంది కళాకారులతో ప్రత్యేక దేశ భక్తి గీతం జయ హే 2.0 ప్రదర్శించింది(Jaya Hey 2.0 Patriotic Song). దేశానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. ‘జయ హో 2.0 అనే టైటిల్ తో రూపొందించారు.
సౌరేంద్రో – సౌమ్యోజిత్ జంటగా ప్రసిద్ది చెందిన సౌరేంద్రో ముల్లిక్ , సౌమ్యోజిత్ దాస్ మదిలో మెదిలింది ఈ గీతం. 1911లో రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన భారత భాగ్య విధాత పూర్తి ఐదు శ్లోకాల కూర్పు ఇది.
ఈ పాటలోని మొదటి పేరా భారత దేశ జాతీయ గీతం జన గణ మణ గా స్వీకరించారు. జయ హే 2.0 గీతం మన ప్రియమైన మాతృభూమి పట్ల గర్వం, ప్రేమ, అభిమానం , గౌరవంతో మనలో నింపే ఒక కలకాలం రాగం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా.
ఈ గీతానికి సంబంధించిన వీడియోను అప్ లోడ్ చేశారు. కోల్ కతాకు చెందిన అంబూజా నియోటియా యూట్యూబ్ ఛానెల్ దీనిని రూపొందించేందుకు సహకారం అందించింది.
జయహే 2.0కి పని చేసిన కళాకారులలో ఆశా భోంస్లే , కుమార్ సాను, హరి హరన్ , అమ్జద్ అలీ ఖాన్ , హరి ప్రసాద్ చౌరాసియా, రషీద్ ఖాన్ , అజోయ్ చక్రవర్తి, శుభా ముద్గల్ , అరుణ సాయిరామ , ఎల్. సుబ్రమణ్యం, విశ్వమోహన్ భట్ తమ గొంతుని, కళా ప్రతిభను చేర్చారు ఈ గీతానికి.
Also Read : 25 ఏళ్లలో ప్రపంచంలో భారత్ టాప్