Mumbai Indians : ఎంత ఎత్తుకు ఎదిగినా తమ మూలాలు మరిచి పోకుండా ఉండడం అన్నది ముఖ్యం. ఏ రంగమైనా గౌరవించడం, అభినందించడం వల్ల సత్ సంబంధాలు మరింత బలపడతాయి.
ఇక క్రీడా రంగానికి సంబంధించి చూస్తే భారత జట్టు ప్రపంచంలో అన్నిటి కంటే ముందంజలో ఉంది.
తాజాగా ముంబై ఇండియన్స్ టీం చేపట్టిన కార్యక్రమం క్రీడా లోకాన్ని విస్తు పోయేలా చేసింది.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ -2022 కు సంబంధించి 15వ సీజన్ రిచ్ లీగ్ ను ఈనెల 26 నుంచి ప్రారంభం కానుంది.
ఈ లీగ్ మ్యాచ్ లన్నీ అత్యధికంగా ముంబైలోనే (Mumbai Indians )కొనసాగనున్నాయి.
కరోనా కారణంగా కొన్నింటినే ఎంపిక చేసింది బీసీసీఐ. రెండు చోట్ల మాత్రమే చేపట్టనుంది బీసీసీఐ. ముంబై, పూణే వేదికగా ఐపీఎల్ జరగనుంది.
ఇందులో భాగంగా ఎంసీబీ, డీవై పాటిల్, సీసీఐ బ్రబౌర్న్ మైదానాలలో ఈ మ్యాచ్ లు నిర్వహించేలా ప్లాన్ చేసింది బీసీసీఐ.
ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ముంబై మహా నగరం అంతటా పాల్గొన బోయే ఐపీఎల్ జట్లకు (Mumbai Indians )సాదర స్వాగతం
పలికేలా హోర్డింగ్ లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. బిల్ బోర్డులతో ఆకట్టుకుంది.
ఈ మేరకు అద్భుతమైన స్లోగన్స్ తయారు చేసింది. రాజాస్తాన్ రాయల్స్ – వెల్ కమ్ హల్లా బోల్ దిల్ కోల్ కే అని,
ఎస్ఆర్ఎచ్ కోసం షైన్ కరో దిల్ కోలే దిల్ కోల్ కే అని ఏర్పాటు చేసింది.
కేకేఆర్ టీంకు వెల్ కమ్ కోర్బో లోర్బో జీత్ బో దిల్ కోల్ కో అని, లక్నో సూపర్ జెయింట్స్ కోసం వెల్ కమ్ కేల్ నవాబీ దిల్ కోల్ కే అంటూ స్వాగతం పలికింది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు వెల్ కమ్ చెబుతూ కేల్ ఢిల్లీ దిల్ కోల్ కే అని, పంజాబ్ కింగ్స్ కు వెల్ కమ్ ..చక్ దే పత్తే దిల్ కోల్ కే అని బిల్ బోర్డు ఏర్పాటు చేసింది.
గుజరాత్ టైటాన్స్ టీం కోసం మజా థీ రామ్ జో దిల్ కోల్ కే అంటూ సీఎస్కే టీంకు విజిల్ పోడూ దిల్ కోల్ కే అని స్వాగతం పలికింది
ముంబై ఇండియన్స్ . ఆర్సీబీ టీంకు వెల్ కమ్ చెబుతూ ప్లే బోల్డ్ దిల్ కోల్ కే అంటూ పలకడాన్ని ఫ్యాన్స్ జేజేలు పలికారు.
Also Read : ఐపీఎల్ లో కోహ్లీని తట్టుకోవడం కష్టం