Jayalalitha Death : జ‌య‌ల‌లిత మ‌ర‌ణం అనుమానాస్ప‌దం

మాజీ జ‌స్టిస్ ఆర్ముగ‌స్వామి షాకింగ్ కామెంట్స్

Jayalalitha Death : దేశ వ్యాప్తంగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌. ఆమె మ‌ర‌ణం అనుమానాస్ప‌ద‌మ‌ని పేర్కొన‌డం హాట్ టాపిక్ గా మారింది(Jayalalitha Death). ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు మ‌ద్రాసు హైకోర్టు మాజీ జ‌స్టిస్ ఏ. ఆర్ముగ‌స్వామి క‌మిష‌న్. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

త‌మిళ‌నాడులో ఇదే ఎక్క‌డ చూసినా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ వైపు అన్నాడీఎంకే పార్టీ ప‌ట్టు కోసం ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌ని స్వామి బ‌జారున ప‌డ్డారు. మ‌రో వైపు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప‌వ‌ర్ లోకి వ‌చ్చేస‌రికి మెల మెల్ల‌గా తీగ లాగ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఆర్ముగ‌స్వామి క‌మిష‌న్ వెల్ల‌డించిన నివేదిక రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుదిపేస్తోంది.

ఈ మొత్తం వ్య‌వ‌హారం జ‌య‌ల‌లిత వెనుక ఉంటూ చ‌క్రం తిప్పిన వీకే శ‌శిక‌ళ(Sashi Kala) చుట్టూ తిరిగేలా క‌నిపిస్తోంది. ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరు అనుమాన‌స్ప‌దంగా ఉంద‌ని పేర్కొంది క‌మిష‌న్. శ‌శిక‌ళ‌తో పాటు ఆనాటి ప్ర‌భుత్వ అధికారి, ఆస్ప‌త్రి వ‌ర్గాల‌పై కూడా దర్యాప్తు జ‌ర‌పాల‌ని సిఫార‌సు చేసింది. ఇదిలా ఉండ‌గా 2016లో మ‌ర‌ణించారు జ‌య‌ల‌లిత‌.

ఆమె మృతిపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. దీనిపై 2017లో మాజీ జ‌డ్జి ఏ. ఆర్ముగ స్వామి నేతృత్వంలో క‌మిష‌న్ ను ఏర్పాటు చేశారు. 2022 ఆగ‌స్టులో క‌మిష‌న్ నివేదిక ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది. డీఎంకే ప్ర‌భుత్వం నివేదిక‌ను శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది.

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్మోహ‌న్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి విజ‌య భాస్క‌ర్ తో పాటు అపోలో ఆస్ప‌త్రి చైర్మ‌న్ ప్ర‌తాప్ రెడ్డి త‌ప్పుడు ప్ర‌క‌ట‌నలు చేశారంటూ క‌మిష‌న్ పేర్కొంది.

Also Read : గీత దాటితే వేటు త‌ప్ప‌దు – టీసీఎస్ సీఓఓ

Leave A Reply

Your Email Id will not be published!