Jharkhand Ex CM : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్..

Jharkhand Ex CM : జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్(Champai Soren) ఆస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. చక్కెర శాతం తగ్గడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు. కాగా, ఆసుపత్రిలో చేరిన కారణంగా ‘మాంఝి పరగణ మహాసమ్మేళన్’కు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతానని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చంపయి సోరెన్ చెప్పారు.

Jharkhand Ex CM Health Updates

జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో గత ఫిబ్రవరి 2న జార్ఖాండ్ ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల తర్వాత జూలైలో హేమంత్ సోరెన్ బెయిలుపై విడుదల కావడంతో సీఎం పదవికి చంపయి సోరెన్ రాజీనామా చేశారు. దీంతో తిరిగి హేమంత్ సోరెన్ సీఎం అయ్యారు. ఈ పరిణామలతో అసంతృప్తి చెందిన చంపయి సోరెన్ గత ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖాండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో బీజేపీలో చేరారు. 67 గిరిజన నేత అయిన చంపయి సోరెన్ ‘జార్ఖాండ్ టైగర్’గా పేరుంది. 1990లో జార్ఖాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేశారు. 2000లో బీహార్ నుంచి జార్ఖాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 1991లో అవిభక్త బీహార్‌లోని సరాయికేల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జేఎంఎం టిక్కెట్టుపై 2000, 2005, 2009, 2014, 2019లో వరుసగా గెలుపొందారు.

Also Read : CM Chandrababu Naidu : పుంగనూరు బాలిక కుటుంబంతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!