Jhulan Goswami : భారతీయ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి(Jhulan Goswami) సంచలనం సృష్టించారు. మహిళా ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. హామిల్టన్ లోని సెడాన్ పార్కు లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఝులన్ ఈ ఘనత సాధించింది.
ఆమె విండీస్ ప్లేయర్ అనిసా మహ్మద్ ను అవుట్ చేసింది. ఆట ప్రారంభమైన వెంటనే తన మొదటి వికెట్ ను పడగొట్టింది. వరల్డ్ కప్ లో 40 వికెట్లు తీసింది. గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లిన్ పుల్ స్టన్ 39 వికెట్లతో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
ఝులన్ గోస్వామి 34 ఏళ్ల రికార్డును అధిగమించింది. ఇదిలా ఉండగా మహిళల ప్రపంచ కప్ లో ఝులన్ కి ఇది 31వ మ్యాచ్ కావడం విశేషం. 39 ఏళ్ల వయసు కలిగిన ప్రస్తుతం తన ఐదో మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించింది.
ఝులన్ గోస్వామి 2005, 2009, 2013, 2017 లలో జరిగిన వరల్డ్ కప్ లలో భారత జట్టు ప్రాతినిధ్యం వహించింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.
ఈ తరుణంలో బరిలోకి దిగిన విండీస్ 162 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. దీంతో టీమిండియా 155 రన్స్ తేడాతో విజయం సాధించింది.
అటు బ్యాటింగ్ లో ప్రభావం చూపిన భారత జట్టు బౌలింగ్ లోను సత్తా చాటింది. స్మృతీ మంథాన, కౌర్ అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 184 రన్స్ జోడించారు.
Also Read : మెరిసిన మంధాన చెలరేగిన కౌర్