Jhulan Periods Comment : ‘పీరియడ్స్’ పై లెవనెత్తిన ప్రశ్నలెన్నో
ఝులన్ గోస్వామి నీకు దేశం సలాం
Jhulan Periods Comment : ఆమె లేక పోతే అతడు లేడు. ఇద్దరూ బతుకు బండిలో ఇరుసు లాంటి వారు. వారిద్దరూ లేక పోతే జీవితం లేదు. ఆనందానికి అర్థం లేదు. ఇదంతా ఒక ఎత్తు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది.
కానీ ఈరోజు దాకా బాలికలు, యువతులు, మహిళలకు అడుగడుగునా వివక్ష కొనసాగుతూనే ఉంది. అది అన్ని చోట్లా పాపగా పుట్టినప్పటి నుంచి
వృద్ధురాలిగా చని పోయేంత దాకా నిరంతరం చస్తూ బతుకుతూ చిరునామా లేని చావులకు గురైది ఆమెనే.
ప్రధానంగా ఈ లోకంలో ఎక్కువగా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. దారుణమైన ఇబ్బందులతో పాటు అత్యాచారాలకు గురవుతూ వస్తున్నారు.
ప్రధానంగా మహిళలు చని పోయేంత వరకు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండేది ఒకే ఒక్క విషయంలో ప్రతి నెలా పుష్పవతి (యువతి ) అయినప్పటి నుంచి పీరియడ్స్ ఆగి పోయేంత వరకు నిత్యం నరకం అనుభవిస్తూ వుంటుంది.
135 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశంలో సగానికి పైగా మహిళలు ఈ పీరియడ్స్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా నాలుగు లేదా అయిదు రోజుల పాటు చెడు రక్తాన్ని పోగొట్టుకుంటూ వుంటారు.
విచిత్రం ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయాలు వెల్లడించింది. చాలా మంది సగానికి పైగా పీరియడ్స్ విషయంలో వాడే లోదుస్తులు
వాడడం లేదని కుండబద్దలు కొట్టింది.
ఇది చాలా బాధాకరం. అత్యంత సిగ్గు పడాల్సిన విషయం. పీరియడ్స్ విషయంలో స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వాలు సైతం అవగాహన కల్పిస్తున్నాయి.
కానీ ఇంకా లోదుస్తులు వాడకంలోకి రాక పోవడం దారుణం. అభివృద్ది చెందిన దేశాలలో చదువుకున్న మహిళలు, యువతులు వాడుతున్నారు.
ఇవాళ నెల నెలా పీరియడ్స్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని భారత దేశానికి చెందిన ప్రముఖ మహిళా క్రికెటర్
ఝులన్ గోస్వామి ప్రత్యేకంగా పీరియడ్స్(Jhulan Periods) అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇవాళ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఆమె సాటి భారతీయ మహిళల గురించి గొంతు విప్పారు. ఒకానొక సమయంలో పీరియడ్స్ గురించి మాట్లాడాలంటే భయపడే వారు. సిగ్గు పడే వారు.
కానీ రోజులు మారాయి. తరాలు మారాయి. టెక్నాలజీ లో వచ్చిన మార్పు కారణంగా మహిళలు తమ పీరియడ్స్ గురించి చర్చించుకుంటున్నారు.
బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఝులన్ గోస్వామి భారత దేశంలోని అన్ని క్రీడారంగంలో ఆడుతున్న క్రికెటర్లే కాదు అథ్లెట్ల గురించి కూడా ఆలోచించాలని సూచించారు.
ఈ విషయంలో పీరియడ్స్ గురించి ప్రత్యేకంగా రీసెర్చ్ (పరిశోధన ) చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె గొంతు విప్పారు.
ఝులన్ గోస్వామి లేవదీసిన ప్రశ్నలు ఆమె తరపు నుంచే కాదు యావత్ భారత దేశం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీవితానికి ఆధారమైన
మహిళలను పురుషులు అర్థం చేసుకోవాలి. వారి బాధకు నివారణోపాయం కనుక్కోవాలి.
Also Read : మహిళా అథ్లెట్ల పీరియడ్స్ పై ఆలోచించాలి