Jio 5G Services : మ‌రికొన్ని ప‌ట్ట‌ణాల్లో జియో 5జీ సేవ‌లు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 9 ప‌ట్ట‌ణాలు

Jio 5G Services : రిల‌య‌న్స్ అంబానీ సార‌థ్యంలోని రిల‌య‌న్ జియో దేశంలో దూసుకు పోతోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా టెలికాం రంగంలో టాప్ లో కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా జియోనే వాడుతున్నారు. జియో కొట్టిన దెబ్బ‌కు ఎయిర్ టెల్ , వొడాఫోన్ ఐడియా నానా తంటాలు ప‌డుతున్నాయి.

కానీ జియోకు ఇప్పుడు కేవ‌లం ప్ర‌త్యామ్నాయంగా ఎయిర్ టెల్ మాత్ర‌మే ఉంది. అది కూడా 5జీ స‌ర్వీసెస్ అందించ‌డంలో ముందంజ‌లో ఉంటోంది. తాజాగా రిల‌య‌న్స్ ట్రూ జియో పేరుతో 5జీ స‌ర్వీసెస్ ను అందిస్తోంది.

దేశ వ్యాప్తంగా ప‌లు ప‌ట్ట‌ణాల‌కు విస్త‌రించేలా ప్లాన్ చేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల‌లో 5జీ సేవ‌ల‌ను(Jio 5G Services) వేగంగా ఇచ్చేందుకు గాను చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఇప్ప‌టికే ఉన్న ప‌ట్ట‌ణాలు కాకుండా మ‌రో 9 న‌గ‌రాల్లో 5జీ సేవ‌లు అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది.

ఇక రిల‌య‌న్స్ జియో త‌క్కువ స‌మ‌యంలోనే అత్య‌ధికంగా యూజ‌ర్ల‌ను పొందింది. త‌క్కువ టారిఫ్ ఎక్కువ వినియోగం అనే కాన్సెప్ట్ తో ముందు యూజ‌ర్ల‌ను బుట్ట‌లో వేసుకునే ప‌నిలో ప‌డింది. ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్లాన్స్ కు జ‌నం అల‌వాటు ప‌డేలా చేయ‌డ‌లో రిల‌య‌న్స్ జియో స‌క్సెస్ అయ్యింది. తాజాగా ఏపీ, తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రికొన్ని ప‌ట్ట‌ణాల‌ను 5జీ స‌ర్వీస్(Jio 5G Services) లో చేర్చింది.

ఏపీలో అనంత‌పురం, చీరాల‌, భీమ‌వ‌రం, గుంత‌క‌ల్ , నంద్యాల్ , తెనాలిల‌లో వీటిని ప్రారంభించింది. ఇక తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ , ఆదిలాబాద్ , రామ‌గుండం ప‌ట్ట‌ణాల‌లో 5జీ స‌ర్వీసెస్ స్టార్ట్ చేసింది.

Also Read : అమ‌ర్త్య సేన్ కు దీదీ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!