5G Jio Airtel : 50 నగరాల్లో 5జీ పరుగులు
అందుబాటులో నెట్ వర్క్
5G Jio Airtel : టచ్ చేస్తే చాలు ప్రపంచం కళ్ల ముందు కనిపించే అద్భుతమైన నెట్ వర్క్ ఇప్పుడు దేశంలో హల్ చల్ చేస్తోంది. టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ తో పాటు వొడాఫోన్ ఐడియా సైతం 5జీ నెట్ వర్క్(5G Jio Airtel) ను అందించడంలో పోటీ పడుతున్నాయి.
ఈ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5జీ నెట్ వర్క్ ను ప్రారంభించాక శరవేగంగా పనులు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్టోబర్ నెల నుంచే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ పోటా పోటీగా దూసుకు పోతుండగా వీఐ (వొడాఫోన్ , ఐడియా ) మాత్రం 5జీ నెట్ వర్క్ ను అందించడంలో వెనుకంజలో ఉంది.
ఇక జియో, ఎయిర్ టెల్ కంపెనీలు దేశంలొని 50 నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. వైర్ లెస్ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యత పెరుగుతోంది. ఇదే విషయాన్ని పార్లమెంట్ సమావేశంలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి వైష్ణవ్ కూడా స్పష్టం చేశారు. ఎలాంటి అదనపు సర్వీస్ ఛార్జి వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.
ఇక దేశ వ్యాప్తంగా 5జీ అందుబాటులో ఉన్న నగరాలను చూస్తే ఇలా ఉన్నాయి. నోయిడా, గ్రేటర్ నోయిడా, సిలిగురి, ఢిల్లీ, గురుగ్రామ్ , బెంగళూరు, హైదరాబాద్, వారణాసి , ముంబై, నాగ్ పూర్ , చెన్నై, గౌహతి, పానిపట్ ఉన్నాయి. వీటితో పాటు పాట్నా, ఫరీదాబాద్ , కోల్ కతా , నాథ ద్వారా, పూణేతో పాటు గుజరాత్ లోని 33 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 5జీ సర్వీసులు ఏర్పాటు చేశాయి దిగ్గజ కంపెనీలు.
Also Read : టాటా కలల కారు మళ్లీ మార్కెట్ లోకి