Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ !
తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ !
Jishnu Dev Varma: తెలంగాణ గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) (66) నియమితులయ్యారు. త్రిపుర రాజవంశీకుడైన జిష్ణుదేవ్ వర్మ… రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లలో బీజేపీలో చేరారు. 2018-23 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గా కూడా విధులు నిర్వహించారు. జిష్ణుదేవ్ వర్మను(Jishnu Dev Varma) తెలంగాణ గవర్నర్ గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఝార్ఖండ్ గవర్నర్ గా పని చేస్తూ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీ రాధాకృష్ణన్ ను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న రమేష్ బైస్ ను తప్పించింది. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులుకాగా… ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్ గా నియమితులు కావడం విశేషం.
Jishnu Dev Varma As A New Governer..
కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించగా, ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేసింది. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్ గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్‌రావ్ బాగ్డేని నియమించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రాను తప్పించింది. అలాగే ఓంప్రకాశ్ మాథుర్ సిక్కిం గవర్నర్ గా, హరిభావు కిషన్ రావు బాగ్డే రాజస్తాన్ గవర్నర్, సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్ గా నియమితులయ్యారు. సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్‌కు, రామెన్ డేకా చత్తీస్‌గఢ్‌కు గవర్నర్లుగా నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌ను మహారాష్ట్రకు మార్చారు. అలాగే అస్సాం గవర్నర్ గులాబ్‌చంద్ కటారియాను పంజాబ్ కు మార్చి చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు.
లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా నియమించి మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చా రు. కె.కైలాస్‌నాథ్‌ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాశ్ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించింది. ఈ స్థానంలో ఉన్న లక్షణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా బదిలీ చేసింది. ఆయనకు మణిపుర్ గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మణిపుర్ గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది. 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.కైలాసనాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. గుజరాత్ సీఎంగా మోదీ పనిచేసినప్పుడు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకూ ఆయన ప్రధాన ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. మొత్తం 11సార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. 2024 జూన్ 30న ఆ పదవీకాలం పూర్తి కావడంతో ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది.
Also Read : Chevireddy Mohit Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అదుపులోనికి తీసుకుని నోటీసులు జారీ చేసిన పోలీసులు !