Jitesh Sharma : జితేశ్ శ‌ర్మ జోర్దార్ ఇన్నింగ్స్

షాన్ దార్ ఇన్నింగ్స్

Jitesh Sharma : మొహాలీలో ప‌రుగుల వ‌ర‌ద పారింది. నువ్వా నేనా అంటూ బ్యాట‌ర్లు దంచి కొట్టారు. ప‌రుగులు చేసేందుకు పోటీ ప‌డ్డారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ముంబై 4 వికెట్లు కోల్పోయి 216 ర‌న్స్ చేసింది.

ముందుగా బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడింది. శిఖ‌ర్ ధావ‌న్ మెరిస్తే లియామ్ లివింగ్ స్టోన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. అత‌డికి తోడుగా వ‌చ్చిన జితేశ్ శ‌ర్మ(Jitesh Sharma) ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డారు ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు. దీంతో పంజాబ్ భారీ స్కోర్ న‌మోదు చేసింది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఆరంభం లోనే వికెట్ త్వ‌ర‌గా కోల్పోయినా ఆ త‌ర్వాత ధావ‌న్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. చావ్లా ఓవ‌ర్ లో సిక్స్ కొట్టిన ధావ‌న్ మ‌రో గూగ్లీ బంతికి బోల్తా ప‌డ్డాడు.

లివింగ్ స్ట‌న్ కు తోడుగా జితేశ్ శ‌ర్మ క‌లిశాడు. జితేశ్ శ‌ర్మ(Jitesh Sharma) కేవ‌లం 27 బంతులు ఆడి 5 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 49 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంత‌కు ముందు శిఖ‌ర్ ధావ‌న్ 5 ఫోర్ల‌తో 30 ర‌న్స్ చేస్తే మాథ్యూ షార్ట్ 2 ఫోర్లు 1 సిక్స‌ర్ తో 27 ర‌న్స్ చేశాడు. ఐపీఎల్ లో 2,000 ర‌న్స్ పూర్తి చేశాడు జితేశ్ శ‌ర్మ‌.

Also Read : సూర్యా భాయ్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!