Joe Biden : తుపాకీ నియంత్ర‌ణ చ‌ట్టానికి బైడెన్ ఓకే

సంత‌కం చేసిన అమెరికా దేశ అధ్య‌క్షుడు

Joe Biden : అమెరికాలో కాల్పుల మోత మోగుతుండ‌డంతో ఆ దేశ అధ్య‌క్షుడు జో బైడెన్(Joe Biden) ఇప్ప‌టికే ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఆ దేశ జ‌నాభా కంటే అక్క‌డ తుపాకులే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఈ మ‌ధ్య చేసిన స‌ర్వేలో తేలింది.

తాజాగా ప్రెసిడెంట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ద్వైపాక్షిక తుపాక నియంత్ర‌ణ చ‌ట్టానికి సంబంధించి సంత‌కం చేశారు. దీనిని బైడెన్ స్మార‌క దినంగా పేరు పెట్టారు.

అయితే దీనిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌గినంత దూరం వెళ్ల‌క పోయినా ఈ చ‌ట్టం ప్రాణాల‌ను కాపాడుతుంద‌న్న విశ్వాసం వ్య‌క్త ప‌రిచారు బైడెన్(Joe Biden).

అమెరికా దేశ రాజ‌ధాని వాషింగ్ట‌న్ డీసీలోని వైట్ హౌస్ లోని రూజ్ వెల్ట్ రూములో యుఎస్ అధ్య‌క్షుడు ద్వైపాక్షిక సుర‌క్షిత క‌మ్యూనిటీల చ‌ట్టంపై సంత‌కం చేశారు.

ఆయ‌న సంత‌కం చేస్తున్న స‌మ‌యంలో బైడెన్ భార్య‌, దేశ ప్ర‌థ‌మ మ‌హిళ జిల్ బైడెన్ కూడా ఉన్నారు. ఒక ర‌కంగా ఇది కీల‌క ప‌రిణామం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప‌రిమిత తుపాకీ భ‌ద్ర‌తా చ‌ర్య‌ల స‌మితిని సంస్థాగ‌తీక‌రించే అరుదైన ద్వైపాక్షిక బిల్లుగా దేశ అధ్య‌క్షుడు తెలిపారు. మూడు ద‌శాబ్దాల కాలంలో అంటే 30 ఏళ్ల‌లో నిత్యం అమెరికాలో ఎక్క‌డో ఒక చోట కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.

టెక్సాస్ లో ఏకంగా ఒకే సారి 19 మంది పిల్ల‌లు చ‌ని పోవ‌డం బాధ‌కు గురి చేసింది. ఆ ఘ‌ట‌న త‌ర్వాత మ‌రికొన్ని ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌మాద‌క‌రంగా భావించే వ్య‌క్తుల నుండి తుపాకుల్ని స్వాధీనం చేసుకునేందుకు ఈ బిల్లు దోహ‌ద ప‌డుతుంది.

Also Read : సుప్రీంకోర్టు తీర్పు బాధాక‌రం – ఒబామా

Leave A Reply

Your Email Id will not be published!