Joe Biden Putin : ఉక్రెయిన్ (Ukraine) పై సైనిక చర్య పేరుతో యుద్దం చేస్తున్న రష్యాపై మరోసారి కన్నెర్ర చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden Putin). ఇప్పటికే ఐక్య రాజ్య సమితి, యూరోపియన్ కంట్రీస్ , బ్రిటన్, ఫ్రాన్స్ , అమెరికా దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధించాయి.
అంతే కాదు వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ సైతం తాను ప్రోటోకాల్ ను వదిలి మాస్కోకు వస్తానని ప్రకటించారు. ఈ దారుణ మారణకాండను తాను తట్టుకోలేక పోతున్నానని వాపోయాడు.
ఇక ప్రపంచ కోర్టు సైతం వెంటనే వార్ ను ఆపాలని ఆదేశించింది. ఇప్పటి వరకు వేలాది మంది పౌరులు, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బాంబుల మోత మోగిస్తోంది.
మిస్సైళ్లతో దాడులకు దిగుతోంది. ఈ సందర్భంగా ఇవాళ బైడెన్ (Joe Biden Putin)సంచలన ప్రకటన చేశారు. మున్ముందు ఈ యుద్దాన్ని కంటిన్యూ చేస్తాడని, పుతిన్ ఒక వేళ ఉక్రెయిన్ (Ukraine)లొంగక పోతే రసాయనిక చర్యలకు దిగే ప్రమాదం ఉందంటూ ప్రపంచాన్ని హెచ్చరించారు.
తమ ఆర్థిక ఆంక్షలకు ప్రతీకారంగా అమెరికాపై రష్యా సైబర్ దాడులకు కూడా దిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా యావత్ ప్రపంచం అప్రమత్తంగా ఉండాలని లేక పోతే సర్వ నాశనం కానుందని పేర్కొన్నారు జోసెఫ్ బైడెన్.
ఇదిలా ఉండగా రష్యా బైడెన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి నిరాదారమైన ఆరోపణలు చేయడం అమెరికా, పశ్చిమ దేశాలకు అలవాటంటూ ఎద్దేవా చేసింది. ఆ దేశ రాయబారిని కూడా పిలిపించి వార్నింగ్ ఇచ్చారు.
Also Read : కారు డ్రైవర్ గా మారిన ఆఫ్గాన్ మాజీ మంత్రి