Johnny Depp : జ్యూరీ తీర్పు మరో జీవితాన్ని ఇచ్చింది

ప‌రువు న‌ష్టం కేసులో గెలిచాక జానీ డెప్

Johnny Depp : ఎవ‌రీ జానీ డెప్ అనుకుంటున్నారా. మోస్ట్ పాపుల‌ర్ హాలీవుడ్ హీరో. కోట్లాది అభిమానులను క‌లిగి ఉన్న అరుదైన న‌టుడు. కానీ అనుకోని రీతిలో గ‌త కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

కెరీర్ ప‌రంగా అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఆయ‌న మాజీ భార్య అంబ‌ర్ హార్డ్ చేసిన తీవ్ర ఆరోప‌ణ‌లు ఒక్క‌సారిగా జానీ డెప్ ను అధః పాతాళానికి తొక్కేసింది.

త‌న‌ను తీవ్రంగా వేధించాడ‌ని, ప్ర‌ధానంగా లైంగికంగా బ‌య‌ట‌కు చెప్పుకోలేని రీతిలో హింసించాడంటూ మాజీ భార్య ఆరోపించింది. ఇదే విష‌యాన్ని ఆమె 2018లో ఓ ప్ర‌త్యేక క‌థ‌నం రాసింది.

ఇదే స‌మ‌యంలో కోర్టుకు ఎక్కింది. త‌న‌ను వేధింపుల‌కు గురి చేయ‌డమే కాకుండా మాన‌సికంగా, శారీర‌కంగా హింసించినందుకు ప‌రువు న‌ష్టం దావా వేసింది. దీంతో ఒక్క‌సారిగా జానీ డెప్(Johnny Depp) కెరీర్ పై తీవ్ర ప్ర‌భావం చూపింది.

ఆయ‌న‌తో కాంట్రాక్టు పెట్టుకున్న భారీ సంస్థ‌ల‌న్నీ క్యాన్సిల్ చేసుకున్నాయి. ఈ స‌మ‌యంలో చాలా సంయ‌మ‌నం పాటించాడు జానీ డెప్. గ‌త కొంత కాలం నుంచి యావ‌త్ ప్ర‌పంచం ఉత్కంఠ‌తో ఎదురు చూసింది.

డెప్ ప‌రువు న‌ష్టం కేసులో ఎలాంటి తీర్పు వెలువ‌డుతుందోన‌ని. చివ‌ర‌కు ఏడుగురు స‌భ్యుల‌తో కూడిన వ‌ర్జీనియా జ్యూరీ జానీ డెప్(Johnny Depp) నిర్దోషి అని తేల్చింది.

చివ‌ర‌కు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసిన మాజీ భార్య అంబ‌ర్ హార్డ్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. ఈ మేర‌కు $ 15 మిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఈ సంద‌ర్బంగా జానీ డెప్ స్పందించాడు. న్యాయం గెలిచింది కొత్త జీవితాన్ని ప్ర‌సాదించింద‌ని చెప్పాడు.

Also Read : ప‌రువు న‌ష్టం కేసులో జానీ డెప్ గెలుపు

Leave A Reply

Your Email Id will not be published!