Jonny Bairstow : చితక్కొట్టిన జానీ బెయిర్ స్టో
బెంగళూరుకు బిగ్ షాక్
Jonny Bairstow : ఐపీఎల్ 2022లో భాగాంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో దంచి కొట్టాడు. ఆకాశమే హద్దుగా చెల రేగాడు. కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొదట బ్యాటింగ్ కు దిగన పంజాబ్ కింగ్స్ పరుగుల వరద పారించింది. మొత్తం 29 బంతులు ఎదుర్కొని 66 పరుగులు చేసి షాబాద్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
బెయిర్ స్టో(Jonny Bairstow) మైదానంలో ఉన్నంత వరకు బెంగళూరు ఆటగాళ్లు పరేషాన్ లో పడ్డారు. ముంబై లోని బ్రబౌర్న్ స్టేడియంలో కీలక మ్యాచ్ జరుగుతోంది. 12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది లివింగ్ స్టోన్ క్రీజులో ఉన్నారు.
ఆర్సీబీ కెప్టెన్ పాఫ్ డుప్లిసిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. శిఖర్ ధావన్ సైతం ధాటిగా ఆడడం మొదలు పెట్టాడు.
15 బంతుల్లో శిఖర్ ధావన్ 21 పరుగుల వద్ద వెనుదిరిగాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ధావన్ , బెయిర్ స్టో(Jonny Bairstow) కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఆర్సీబీ నాల్గో స్థానంలో ఉండగా పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ తరపున జోస్ బట్లర్ టాప్ లో ఉండగా పంజాబ్ కు బెయిర్ స్టో కీలకంగా మారాడు. ప్రస్తుతం లివింగ్ స్టోన్ , మయాంక్ అగర్వాల్ ఆడుతున్నారు కడపటి వార్తలు అందేసరికి.
Also Read : పుజారా పునరాగమనంపై సన్నీ కామెంట్