Jos Butler : ఇంగ్లండ్ టి20 కెప్టెన్ గా జోస్ బ‌ట్ల‌ర్

ఇయాన్ మోర్గాన్ స్థానంలో ప్ర‌మోష‌న్

Jos Butler : ప్ర‌పంచ క్రికెట్ లో మోస్ట్ పాపుల‌ర్ హిట్ట‌ర్ గా పేరొందిన జోస్ బ‌ట్ల‌ర్ కు అరుదైన చాన్స్ ల‌భించింది. ఇంగ్లండ్ సౌత్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తాజాగా ఇంగ్లండ్ టి20 జ‌ట్టు కెప్టెన్ గా నియ‌మించింది.

జూన్ 28న సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ఇయాన్ మోర్గాన్. ఆ దేశ జ‌ట్టును అత్యంత బ‌లోపేతం చేయ‌డంలో మోర్గాన్ కీల‌క పాత్ర పోషించాడు.

కొత్త ఆట‌గాళ్ల‌ను త‌యారు చేయ‌డంలో కృషి చేశాడు. 2019లో మొద‌టిసారిగా వ‌ర‌ల్డ్ క‌ప్ ను తీసుకు వ‌చ్చాడు. 40 ఏళ్ల‌కు పైగా అంద‌కుండా ఉండి పోయిన ప్ర‌పంచ క‌ప్ ను తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ఇయాన్ దే. అన్ని ఫార్మాట్ ల నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

దీంతో అత‌డి స్థానంలో జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler) స‌రైన క్రికెట‌ర్ అని ఈసీబీ భావించింది. ఆ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలా ఉండ‌గా ఇంగ్లాండ్ లోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానుల‌ను క‌లిగిన ఇంగ్లీష్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్

ప్ర‌ధానంగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

మొత్తం టోర్నీలో అత్య‌ధిక అవార్డులు అందుకున్న ప్లేయ‌ర్ గా కూడా ఘ‌న‌త వ‌హించాడు. ఇదే స‌మ‌యంలో స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగిన టెస్టు సీరీస్ లో దుమ్ము రేపాడు.

10,000 వేల ప‌రుగులు పూర్తి చేశాడు. అయితే గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా ఇంగ్లండ్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా కొన‌సాగుతూ వ‌చ్చాడు.

Also Read : ఉత్కంఠ పోరుకు భార‌త్ ఇంగ్లండ్ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!