Jos Butler : రాణిస్తా పరుగుల వరద పారిస్తా
జోస్యం చెప్పిన జోస్ బట్లర్
Jos Butler : ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన రిచ్ లీగ్ గా పేరొందిన బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) ఆఖరి దశకు చేరింది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ లు కొనసాగాయి.
ఇప్పటి వరకు ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. రెండు అదనంగా చేరాయి. ఆ రేండే గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ . ఇక ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది.
మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన ఈ జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్స్ కు చేరి టైటిల్ కోసం పోరాడనుంది. ఈ సందర్భంగా ఈ జట్టు తరపున అత్యధిక పరుగులు చేయడమే కాదు ఏకంగా ఐపీఎల్ టోర్నీలో మోస్ట్ రన్స్ చేసిన క్రికెటర్ గా నిలిచాడు స్టార్ హిట్టర్, ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ (Jos Butler) .
ప్రారంభంలో అదరగొట్టాడు. ఏకంగా 629 రన్స్ సాధించి ఐపీఎల్ ఆరేంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. కాగా లాస్ట్ మ్యాచ్ లలో అంతగా రాణించలేదు. తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు.
ఈ తరుణంలో కోల్ కతా వేదికగా జరగనున్న మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో తాను తప్పక రాణిస్తానని, పరుగుల వరద పారిస్తానంటున్నాడు ఎంతో నమ్మకంగా జోస్ బట్లర్(Jos Butler).
ఈసారి ఎవరినీ వదలనని, దంచి కొట్టడమేనని స్పష్టం చేశాడు. మరి గుజరాత్ ఏ మేరకు అతడిని కట్టడి చేస్తుందో చూడాలి.
Also Read : టైటిల్ స్పాన్సర్‌షిప్ తో కోట్లే కోట్లు