Jos Butler : ఓపెనింగ్ లో రిచ‌ర్డ్స్..రోహిత్ బెట‌ర్

ఆ ఇద్ద‌రి ఆట‌గాళ్ల‌తో ఓపెనింగ్ బెట‌ర్

Jos Butler : ఐపీఎల్ 2022లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్, ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జోస్ బట్ల‌ర్.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు ఏడు మ్యాచ్ లు ఆడింద. రెండు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలై 5 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. ఈ మొత్తం మ్యాచ్ ల‌లో జోస్ బ‌ట్ల‌ర్ (Jos Butler) మూడు సెంచ‌రీలు చేశాడు.

ఆరెంజ్ క్యాప్ రేసులో అంద‌నంత దూరంలో ఉన్నాడు. ఆ త‌ర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. బ‌ట్ల‌ర్ కు రాహుల్ కు మ‌ధ్య ప‌రుగుల తేడా 200 కంటే ఎక్కువ‌గా ఉంది.

ప్ర‌స్తుతం ఐపీఎల్ లో టాప్ ఓపెన‌ర్ గా కొన‌సాగుతున్నాడు బ‌ట్ల‌ర్. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్నాడు. ఇదిలా ఉండ‌గా త‌న ఓపెనింగ్ భాగ‌స్వామిగా ఎవ‌రైతే బాగుంటుందోన‌నే దానిపై స్పందించాడు.

మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ట్ల‌ర్ 491 ప‌రుగులు చేశాడు. త‌న డ్రీమ్ ఓపెనింగ్ లో గ‌త‌, మ‌రియు ప్ర‌స్తుత కాలానికి చెందిన ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌ను ఉద‌హ‌రించాడు.

గ‌త కాలం నుంచి వివియ‌న్ రిచ‌ర్డ్స్ ను పేర్కొంటే ఈ కాలంలో భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ , ముంబై ఇండియ‌న్స్ కు సార‌థ్యం వ‌హిస్తున్న రోహిత్ శ‌ర్మ అయితే బాగుంటుంద‌ని వెల్ల‌డించాడు

. ఇక బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ బెట‌ర్ అన్నాడు జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler). ఇక ఐపీఎల్ లో తాను చేసిన 93 ప‌రుగులు అత్యుత్త‌మంగా భావిస్తాన‌ని చెప్పాడు.

2018లో ముంబై ఇండియ‌న్స్ పై చేసిన ఆ ప‌రుగులే త‌న‌కు ఇష్ట‌మ‌న్నాడు. ఇదిలా ఉండ‌గా బ‌ట్ల‌ర్ 35, 100, 70, 13, 54, 103, 116 ర‌న్స్ చేశాడు.

Also Read : జాన్సెన్ పై లారా ప్ర‌శంస‌ల జ‌ల్లు

Leave A Reply

Your Email Id will not be published!