Jos Butler : జోరు మీదున్న జోష్ బ‌ట్ల‌ర్

మార‌థాన్ ఇన్నింగ్స్ తో షాక్

Jos Butler : స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన కేర‌ళ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఐపీఎల్ 2022లో దుమ్ము రేపుతోంది. అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌ధానంగా అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటుతోంది.

య‌శ‌స్వి జైశ్వాల్, జోష్ బ‌ట్ల‌ర్(Jos Butler) , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , సంజూ శాంస‌న్, హెట్మెయిర్ , రియాన్ ప‌రాగ్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇలా వ‌రుస‌గా విధ్వంస‌క‌ర బ్యాట‌ర్లు ఉన్నారు.

మొద‌ట బ్యాటింగ్ కు దిగితే ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఒక‌రిని మించి మ‌రొక‌రు ఆడుతున్నారు. క‌ళ్లు చెదిరేలా సిక్స‌ర్ల మోత మోగిస్తున్నారు.

ఇక ఫోర్ల సంగ‌తి చెప్పాల్సిన ప‌ని లేదు. ఐపీఎల్ 2022 హాట్ ఫెవ‌రేట్ గా ఉన్న ముంబై ఇండియ‌న్స్ కు చుక్క‌లు చూపించింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఏకంగా ముందు బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టులో జోష్ బ‌ట్ల‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

ఫ‌స్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీతో మెరిసిన ఈ స్టార్ హిట్ట‌ర్ ముంబైకి వ‌ణుకు పుట్టించాడు. ఏకంగా 11 ఫోర్లు 5 సిక్స్ ల‌తో 100 ప‌రుగులు చేసి ఔరా అనిపించాడు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు డైరెక్ట‌ర్ క‌మ్ మెంటార్ గా ఉన్న శ్రీ‌లంక క్రికెట్ దిగ్గ‌జం కుమార సంగ‌క్క‌ర ఎప్పుడైతే వ‌చ్చాడో ఆ జ‌ట్టుకు మ‌రింత బ‌లం పెరిగింది.

ఎంచుకున్న ప్లేయ‌ర్లు త‌మ మీద మేనేజ్ మెంట్ పెంచుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ఆడుతున్నారు. స‌త్తా చాటుతున్నారు. జ‌య‌హో జోష్ బ‌ట్ల‌ర్(Jos Butler). ఇక బౌల‌ర్లు సైతం ఔరా అనిపిస్తున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం క‌ప్ కొట్ట‌డం ఖాయం.

Also Read : రాహుల్ ‘కోచింగ్’ లో ది వాల్

Leave A Reply

Your Email Id will not be published!