Jos Butler Orange Cap : ఈసారి ఆరెంజ్ క్యాప్ అత‌డిదే

16 మ్యాచ్ లో 800కి పైగా ప‌రుగులు

Jos Butler Orange Cap : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ఆఖ‌రి అంకం ముగిసేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. రిచ్ లీగ్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడికి ఆరెంజ్ క్యాప్(Orange Cap) పేరుతో అవార్డు ఇస్తారు.

ఈసారి ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్. ఇప్ప‌టి వ‌ర‌కు 16 మ్యాచ్ లు ఆడాడు. 800కి పైగా ప‌రుగులు చేశాడు. భారీ సిక్స‌ర్లు కొట్టాడు.

అత్య‌ధిక ఫోరు, అత్య‌ధిక సిక్స‌ర్లు కూడా జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler Orange Cap) పైనే న‌మోదై ఉన్నాయి. ఈ ఐపీఎల్ టోర్నీలో బెంగ‌ళూరుతో చేసిన సెంచ‌రీతో నాలుగో సెంచ‌రీ. ఈసారి టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ గా నిలిచాడు.

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఎక్కువ ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. దివంగ‌త ఆసిస్ క్రికెట్ దిగ్గ‌జం షేన్ వార్న్ సార‌థ్యంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు 2008లో ప్రారంభ‌మైన మొద‌టి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది.

ఆనాటి నుంచి నేటి దాకా ఫైన‌ల్ కు చేర‌లేదు. అంటే 14 ఏళ్ల త‌ర్వాత ఐపీఎల్ ఫైన‌ల్ కు చేరింది సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్తాన్. ఈ అసాధార‌ణ విజ‌యాల‌లో జోస్ బ‌ట్ల‌ర్ కీల‌క పాత్ర పోషించాడు.

ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌యిర్ -2లో 6 బంతులు ఆడి 10 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో 106 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. త‌న‌కు ఎదురే లేద‌ని స‌త్తా చాటాడు జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler) .

బ‌ట్ల‌ర్ కొట్టిన దెబ్బ‌కు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఠారెత్తింది. దిక్కు తోచ‌ని స్థితిలో ప‌డి పోయింది. మొత్తంగా సంజూ శాంస‌న్ కెప్టెన్సీకి ప‌లువురు ఆట‌గాళ్లు ఫిదా అయ్యారు.

Also Read : బ‌ట్ల‌ర్ సెంచ‌రీ ఫైన‌ల్ కు చేరిన రాజ‌స్థాన్

Leave A Reply

Your Email Id will not be published!