Josh Hazlewood : ల‌క్నోను దెబ్బ కొట్టిన హాజిల్ వుడ్

మ‌రోసారి శాసించిన ఆసిస్ బౌల‌ర్

Josh Hazlewood : ఐపీఎల్ 2022లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త రికార్డులు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌ధాన జ‌ట్లు విజ‌యం కోసం ఎదురు చూస్తుండ‌గా అనామ‌క జ‌ట్ల‌న్నీ ఇప్పుడు విజ‌యాల‌తో దూసుకు పోతున్నాయి.

ఒక్కో మ్యాచ్ లో ఇద్దరు లేదా ముగ్గురు ఆట‌గాళ్లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌దైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు. దీంతో ఐపీఎల్ కు ఎన‌లేని ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆదాయం ఈ టోర్నీ ద్వారా స‌మ‌కూరుతోంది బీసీసీఐకి.

ఇక హాజిల్ వుడ్ విష‌యానికి వ‌స్తే ఐపీఎల్ లీగ్ మ్యాచ్ సంద‌ర్భంగా ల‌క్నో సూప‌ర్ జెయొంట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆసిస్ స్టార్ ప్లేయ‌ర్ హాజిల్ వుడ్(Josh Hazlewood) మ‌రోసారి స‌త్తా చాటాడు. ల‌క్నో ప‌త‌నాన్ని శాసించాడు.

ఏకంగా 4 వికెట్లు తీసి త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. చివ‌రి దాకా పోరాడుతూ వ‌చ్చిన ల‌క్నో ఆట‌గాళ్ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు హాజిల్ వుడ్. కేవ‌లం 17 ఏళ్ల వ‌య‌సు ఉన్నప్పుడే న్యూ సౌత్ వేల్స్ జ‌ట్లుకు ఎంపిక‌య్యాడు.

అద్భుత‌మైన బంతుల‌తో మెస్మ‌రైజ్ చేయ‌డం, ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో నిద్ర పోవ‌డం మ‌నోడి స్పెషాలిటీ. 2010లో ఆసిస్ త‌ర‌పున వ‌న్డే మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన అతి పిన్న వ‌య‌స్కుడిగా పేరొందాడు హాజిల్ వుడ్.

2020 ఐపీఎల్ కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ అత‌డిని కొనుగోలు చేసింది. ఇక ఈసారి ఫిబ్ర‌వ‌రి 12, 13 ల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మెగా వేలంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తీసుకుంది హాజిల్ వుడ్ ను.

Also Read : కార్తీక్ ఎంట్రీకి వ‌య‌సుతో ప‌నేంటి

Leave A Reply

Your Email Id will not be published!