Jupally Krishna Rao : జూప‌ల్లి కారు దిగ‌నున్నారా

ప్ర‌ధాన పార్టీలు ఫోక‌స్

Jupally Krishna Rao : మాజీ మంత్రిగా , సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా పేరొందిన ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా కొల్లాపూర్ కు చెందిన జూప‌ల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కారు దిగే స‌మ‌యం ఆస‌న్న‌మైందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

కాంగ్రెస్ లో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

టీఆర్ఎస్ లో చేరిన ఆయ‌న‌కు సీఎం మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఆ త‌ర్వాత 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడి పోయారు.

త‌న ఓట‌మికి టీఆర్ఎస్ కు చెందిన వారే ప‌ని చేశారంటూ అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు చేశారు.

ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చ‌రిత్ర ఆయ‌న‌కుంది. ప్ర‌తి ఊరులో జూప‌ల్లికి స్వంత కేడ‌ర్ కూడా ఉంది.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో జూప‌ల్లి హ‌వాకు చెక్ ప‌డిన‌ట్ల‌యింది. కొంత కాలం పాటు మౌనంగా ఉన్న

జూప‌ల్లికి మంత్రి ప‌ద‌వి కాక పోయినా క‌నీసం ఏదైనా కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌ని అనుకున్నారంతా.

కానీ ఎమ్మెల్సీ ప‌ద‌వి రాలేదు. కార్పొరేష‌న్ ప‌ద‌వి ఊసే లేదు. దీంతో ఖ‌మ్మంలో మ‌రో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు నివాసంలో జూప‌ల్లి భేటీ అయ్యారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఒక‌ప్పుడు చక్రం తిప్పిన చ‌రిత్ర జూప‌ల్లిది.

ఇప్ప‌టికే ఆయ‌న త‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు. 30 ఏళ్ల పాటు త‌న‌కు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంద‌న్నారు జూప‌ల్లి . త్వ‌ర‌లో ఓ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు.

స్వంత గూటికి వెళ‌తారా లేక బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అన్న‌ది తేలాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు జూప‌ల్లి. ప్ర‌స్తుతం జూప‌ల్లి వ‌ర్సెస్ బీరం వ‌ర్గాలుగా విడి పోయారు.

ఇటీవ‌ల సీఎం వ‌న‌ప‌ర్తికి వ‌చ్చినా ఆయ‌న వెళ్ల‌లేదు. కాంగ్రెస్ లో చేర‌తారా లేక బీజేపీలోకి జంప్ అవుతారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Also Read : రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌పై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!