Justice Madan Lokur : రెజ్ల‌ర్ల‌పై ఖాకీల దాడులు దారుణం

మాజీ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం

Justice Madan Lokur : సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ లోకూర్ నిప్పులు చెరిగారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య చీఫ్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌హిళా రెజ్ల‌ర్లు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 30 మంది మ‌హిళా రెజ్ల‌ర్లు రోడ్డెక్కారు. దేశ రాజ‌ధాని న‌డి బొడ్డున జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. వారి దీక్ష‌ను భ‌గ్నం చేస్తూ మ‌హిళా రెజ్ల‌ర్ల ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించారు ఢిల్లీ ఖాకీలు. దేశ‌మంత‌టా వారు ప్ర‌వ‌ర్తించిన తీరు ప‌ట్ల తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై రెండు కేసులు న‌మోదు అయ్యాయి. జూన్ 15 లోపు విచార‌ణ పూర్తి చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సాక్షుల‌ను ఎంపీ బెదిరిస్తున్నారంటూ బాధిత రెజ్ల‌ర్లు వాపోయారు.

ఇదిలా ఉండ‌గా నిజాల‌ను నిక్క‌చ్చిగా మాట్లాడే న్యాయ‌మూర్తుల‌లో ఒకరిగా గుర్తింపు పొందారు జ‌స్టిస్ లోకూర్. న్యాయ‌వాదులు న్యాయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నందు వ‌ల్ల బాధితుల‌కు పునరావాసం జ‌రిగిందంటూ పేర్కొన్నారు జ‌స్టిస్ లోకూర్. కేసుల నిర్వ‌హ‌ణ‌, ఎఫ్ఐఆర్ లు, రెజ్ల‌ర్ల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు పై మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మ‌ద‌న్ లోకూర్(Justice Madan Lokur) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

మ‌ల్ల యోధుల పోరాటం సంస్థ‌ల జవాబుదారీత‌నం అనే అంశంపై ఆయ‌న మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా లైంగిక వేధింపుల ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించేందుకు భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య‌కు ప్ర‌త్యేకించి ఒక క‌మిటీ కూడా లేద‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఇప్ప‌టికే కోర్టు స్పష్టం చేసింద‌న్నారు.

Also Read : MK Stalin Senthil Balaji : సెంథిల్ ను ప‌రామ‌ర్శించిన స్టాలిన్

 

Leave A Reply

Your Email Id will not be published!