Justice NV Ramana : రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి భారీ విరాళం

వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందించారు...

Justice NV Ramana : రెండు తెలుగు రాష్ట్రాలు వరద కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఏపీలోని పలు జిల్లాలు, తెలంగాణలోని పలు జిల్లాలు వరద ఉధృతికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజానీకానికి నిలువ నీడ కూడా లేకుండా పోయింది. వరద నష్టం అంచనాలకు అందడం లేదు. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు సాయమందించేందుకు శ్రమిస్తున్నా సరిపడా వనరులు లేక ఇబ్బంది పడుతున్నాయి. ఈ తరుణంలోనే విరాళాలను అర్థిస్తున్నాయి. దీనికి సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది. తమ వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇవాళ ఉదయం మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Justice NV Ramana Donate

వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Justice NV Ramana) విరాళం అందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 10 లక్షల రూపాయలు చెక్‌లను రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు జస్టిస్ ఎన్వీ రమణ అందించారు. వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు రాష్ట్రాల సీఎంలను జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. ఏపీ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు జస్టిస్ ఎన్వీ రమణ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహాయాన్ని అందించాలన్నారు.

తుపాన్ కారణంగా మరణాలు సంభవించడం దురదృష్టకరమని జస్టిస్ ఎన్వీ రమణ(Justice NV Ramana) పేర్కొన్నారు. తోటి మనుషులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి గురజాడ స్పూర్తితో తన వంతు సహాయాన్ని అందించానన్నారు. చైతన్యంతో ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్నవారికి తోచిన విధంగా అందరూ సహాయాన్ని అందించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. వారికి అండగా నిలవాలని కోరారు. సమాజంలో ఆకలి, అశాంతి ఉంటే ఎంత సంపద ఉన్నా మనం అనుభవించలేమనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆర్థిక సహాయాన్ని అందించిన జస్టిస్ ఎన్వీ రమణకు రెండు రాష్ట్రాల ఆర్సీలు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Srisailam Project : శ్రీశైలం పవర్ హౌస్ లో భారీ పేలుడు

Leave A Reply

Your Email Id will not be published!