Justice SV Bhatti Comment : ఎవరీ జస్టిస్ భట్టి ఏమిటా కథ
బాబు కేసు నుంచి తప్పుకున్న వైనం
Justice SV Bhatti Comment : ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు జస్టిస్ ఎస్వీ భట్టి. కారణం దేశ రాజకీయాలలో కీలకమైన నాయకుడిగా ఉన్న , టీడీపీ చీఫ్ ,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పటిషన్ పై విచారణ చేపట్టాల్సిన బెంచ్ నుంచి తప్పుకున్నారు . ఇది ఒక రకంగా బాబుకు కోలుకోలేని షాక్. అపారమైన అనుభవం కలిగిన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. ఇంతకీ ఎస్వీ భట్టి ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తీర్పు లేదా విచారణ జరిపేందుకు స్వంత ప్రాంతం అడ్డు పడుతుందేమోనన్న భావనతో వద్దనుకున్నారా లేక పీకల లోతు అవినీతి, అక్రమాలతో కూరుకు పోయిన చంద్రబాబు నాయుడు విషయంలో లేనిపోని తలనొప్పులు ఎందుకు భరించాలని అనుకున్నారో తెలియాల్సి ఉంది.
Justice SV Bhatti Comment Viral
కానీ జస్టిస్ ఎస్వీ భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి. ఆయన మే6, 1962లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో పుట్టారు. గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, కేరళ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. భారత దేశ సర్వోన్నత న్యాయమూర్తిగా ఈ ఏడాది జూలై 14న కొలువు తీరారు. ఆయనను ఏరికోరి సిపారసు చేశారు సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ఏపీ హైకోర్టులో ఉన్న సమయంలో హిందూస్థాన్ షిప్ యార్డ్ , ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ , భారత్ ఎలక్ట్రానిక్స్ , బీహెచ్పీవీ, ఆర్ఎస్వీపీ , తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్ మెంబర్ గా పనిచేశారు. ప్రభుత్వ ప్లీడర్ గా కూడా పని చేశారు ఎస్వీ భట్టి(SV Bhatti). 2019 దాకా అమరావతి హైకోర్టులో సేవలు అందించారు. అదే ఏడాది కేరళ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కేరళ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
ఆ తర్వాత పదోన్నతిపై సర్వోన్నత న్యాయ స్థానంకు బదిలీ అయ్యారు. ఇదిలా ఉండగా జస్టిస్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి విచారణ జరిపేందుకు సీజేఐ నియమించారు. కానీ ఉన్నట్టుండి బాబుకు షాక్ ఇస్తూ తాను విచారణ చేపట్టలేనంటూ స్పష్టం చేశారు జస్టిస్ ఎస్వీ భట్టి. దీంతో విస్తు పోవడం బాబు వంతైంది. రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా ఒత్తిళ్లు ఏమైనా పని చేశాయా లేక తనంతకు తానుగా తప్పుకున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో మరో ఘటన చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసుకు సంబంధించి విచారణ బెంచ్ నుంచి జడ్జీలు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది కూడా అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా జస్టిస్ ఎస్వీ భట్టి చర్చకు దారి తీసేలా చేశారు. మొత్తంగా భట్టి(SV Bhatti) నిర్ణయం అంతులేని ప్రశ్నలను మిగిల్చి అని చెప్పక తప్పదు.
Also Read : RK Roja Selvamani : బాబును ఎవరూ కాపాడ లేరు – రోజా