K Raghavendra Rao : చంద్రుడు రావాలి వెలుగు తేవాలి
దర్శకుడు కె. రాఘవేంద్ర రావు
K Raghavendra Rao : హైదరాబాద్ – ప్రముఖ చలన చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి బేషరతుగా ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఊచలు లెక్క బెడుతున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపారు.
K Raghavendra Rao Protest Chandrababu
సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు దర్శకేంద్రుడు. కావాలని కక్ష సాధింపుతో చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉందని వాపోయారు కె. రాఘవేంద్ర రావు. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడని, ముందు చూపు కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.
చంద్రుడు రావాలని వెలుగు తేవాలని, ఆ సత్తా ఒక్క నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు దర్శకేంద్రుడు. ఇవాళ హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ది చెందడానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని కొనియాడారు. ఆయన లేక పోతే ఇవాళ ఐటీ రంగమే ఉండేది కాదన్నారు.
ఆయన టాలీవుడ్ అభివృద్దికి ఎంత గానో కృషి చేశారని ప్రశంసించారు కె. రాఘవేంద్ర రావు(K Raghavendra Rao). ప్రస్తుతం దర్శకేంద్రుడు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Eatala Rajender : కేసీఆర్ పై ఈటల కన్నెర్ర