K Raghavendra Rao : రాఘవేంద్రరావు బాబు జపం
మీ వల్లనే హైటెక్ సిటీ నిర్మాణం
K Raghavendra Rao : హైదరాబాద్ – ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు జపం మానడం లేదు. తన స్వామి భక్తిని చాటుకుంటున్నారు. పదే పదే ఆయనను పొగడడం మాత్రం మాను కోవడం లేదు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతాన్ని పట్టించు కోలేదు. పూర్తిగా సర్వ నాశనం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి యువతను, ప్రత్యేకించి నయీం ముఠాను తయారు చేసిందే చంద్రబాబు అన్న విమర్శలు లేక పోలేదు.
K Raghavendra Rao Chandrababu Praise Viral
తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపార పరంగా, సినీ రంగంలో కూడా తన వారికి లబ్ది చేకూర్చేలా ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయినా న్యాయ వ్యవస్థలో పరపతి ఉపయోగించుకుని తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా మ్యానేజ్ చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు.
ఒక నాడు కేవలం 2 ఎకరాల ఆస్తి మాత్రమే ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక దర్శకుడిగా గుర్తింపు పొందిన కె. రాఘవేంద్రరావు(K Raghavendra Rao) ఈ మధ్యన తెగ ఆందోళన చెందుతున్నారు. ఆయన అరెస్ట్ అక్రమమని వాపోతున్నారు. ఆపై హైటెక్ సిటీ నిర్మాణం చంద్రబాబు వల్లనే జరిగిందని చెబుతున్నారు.
Also Read : AP Trains Stop : 14 రైళ్లు రద్దు 5 దారి మళ్లింపు