KA Paul : మునుగోడు ఉప ఎన్నికల్లో గోల్ మాల్ – పాల్
ఈవీఎంలను మాయం చేస్తున్నారంటూ ఆరోపణ
KA Paul : ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గోల్ మాల్ జరిగే అవకాశం ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ తరపున పోటీ చేశారు. శుక్రవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ చోటు చేసుకోక పోతే తాను గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు.
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు నిలిచి పోతుందన్నారు. తాను స్వయంగా ఎన్నికల సందర్భంగా బూత్ లు పరిశీలించాలనని అత్యధికంగా తనకే ఓట్లు పడ్డాయని అన్నారు కేఏ పాల్. తనపై నమ్మకం ఉంచిన వారందరికీ, తనకు సహకరించిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు.
తాను ఇప్పటి వరకు తిరగని దేశమంటూ లేదని, కనీసం 150కి పైగా దేశాలు పర్యటించానని చెప్పారు. శాంతిని పరిరక్షించే రాయబారిగా తన బాధ్యతను ఇప్పటికీ నిర్వహిస్తున్నానని తెలిపారు. తనపై మూడు సార్లు దాడులు జరిగాయని, ప్రస్తుతం ఉన్న ఎస్పీ టీఆర్ఎస్ కు ఏజెంట్ గా పని చేశాడని సంచలన ఆరోపణలు చేశారు కేఏ పాల్(KA Paul).
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. అక్కడ ఈడీ, సీబీఐలను వాడుతుంటే ఇక్కడ సీబీసీఐడీలను వాడుతున్నారని తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్ల పాలనో మునుగోడు ఏమైనా అభివృద్ది చెందిందా అని ప్రశ్నించారు.
ఓట్ల లెక్కింపు న్యాయంగా జరిగితే తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : 7న రాహుల్ బహిరంగ సభ – రేవంత్ రెడ్డి