Kadiyam Srihari : బీఆర్ఎస్ షాక్ ఇచ్చిన సీనియర్ నేత కడియం
కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది
Kadiyam Srihari : బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ లో చేరుతున్న కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కడియం చెబుతున్న విలువలు ఇవేనా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కడియంకు కేసీఆర్ ఎక్కువ అవకాశాలు ఇస్తుంటే పార్టీపై అసత్య ప్రచారం సరికాదన్నారు. బీసీలు, దళితుల రాజకీయ ఎదుగుదలను కడియం శ్రీహరి అడ్డుకుంటున్నారని మరో మాజీ ఎంపీ దశ్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కేసీఆర్ కడియంకి ఇచ్చినన్ని అవకాశాలు ఎవరికీ ఇవ్వలేదన్నారు.
Kadiyam Srihari May be Join in Congress
కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. సమావేశంలో ఎర్రబెల్లి దయాకల్ రావు, వినయ్ భాస్కర్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కడియం(Kadiyam Srihari) రాజీనామా లేఖ ఆశ్చర్యానికి గురి చేసిందని వినయ్ భాస్కర్ అన్నారు. ఈనెల 31న తమ పార్టీ మేనిఫెస్టో ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. దీంతో తాము అయోమయంలో ఉన్నామని చెప్పారు. శ్రీహరి ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా.. ఆయన అణిచివేత ధోరణి వల్ల చాలా మంది బాధితులు బలైపోయారని అన్నారు.
Also Read : Congress : గాలి జనార్దన్ రెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ పిర్యాదు