Kagiso Rabada : క‌గిసో ర‌బాడ అరుదైన ఘ‌న‌త

టీ20 క్రికెట్ లో 200 వికెట్లు

Kagiso Rabada : స‌ఫారీ స్టార్ బౌల‌ర్ క‌గిసో ర‌బాడ అరుదైన ఘ‌న‌త‌ను స్వంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 54 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఇందులో భాగంగా క‌గిసో ర‌బాడ పంజాబ్ త‌ర‌పున ఆడుతున్నాడు. మ్యాచ్ లో భాగంగా ఆర్సీబీకి చెందిన హ‌ర్ష‌ల్ ప‌టేల్ ను ఔట్ చేయ‌డంతో టీ20 ఫార్మాట్ లో 200వ వికెట్ సాధించిన బౌల‌ర్ గా నిలిచాడు.

రబాడ అత్యంత వేగంగా వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో మూడో బౌల‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు క‌గిసో ర‌బాడ‌. ఇప్ప‌టి వ‌ర‌కు పొట్టి ఫార్మాట్ లో 146 మ్యాచ్ లు ఆడి 200 వికెట్లు తీశాడు.

ఇక ఐపీఎల్ హిస్ట‌రీలో క‌గిసో ర‌బాడా(Kagiso Rabada) కంటే ముందు ఆఫ్గ‌నిస్తాన్ స్టార్ బౌల‌ర్, ప్ర‌స్తుతం గుజ‌రాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ర‌షీద్ ఖాన్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు.

మొత్తం 134 మ్యాచ్ లు ఆడాడు. 200 వికెట్ల‌ను తీసి ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఇక పాకిస్తాన్ కు చెందిన స్టార్ స్పిన్న‌ర్ అజ్మ‌ల్ 139 మ్యాచ్ లు

ఆడి 200 వికెట్లు తీస్తే ఉమ‌ర్ గుల్ 147 మ్యాచ్ ల‌లో 200 వికెట్లు తీసి నాలుగో ప్లేస్ లో నిలిచాడు.

ఇక శ్రీ‌లంకకు చెందిన స్టార్ పేస‌ర్ ల‌సిత్ మ‌లింగ 149 మ్యాచ్ లు ఆడి ఐదో స్థానంలో ఉన్నాడు. ర‌బాడా(Kagiso Rabada)
25 మే 1995లో ద‌క్షిణాఫ్రికా లోని జోహన్నెస్ బ‌ర్గ్ లో పుట్టాడు.

వ‌య‌సు 26 ఏళ్లు. 2014 నుంచి స‌ఫారీ జ‌ట్టుకు ఆడుతున్నాడు. 5 న‌వంబ‌ర్ 2015లో ఇండియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. 10 జూలై 2015లో బంగ్లాదేశ్ తో వ‌న్డేలో అరంగేట్రం చేశాడు.

5 న‌వంబ‌ర్ 2014లో ఆస్ట్రేలియాతో టీ20 ఆడాడు. 2007 నుంచి 2021 వ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ మేనేజ్ మెంట్ ర‌బాడాను రూ. 9.25 కోట్ల‌కు తీసుకుంది.

 

Also Read : నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్

Leave A Reply

Your Email Id will not be published!