K Viswanath : విశ్వ‌నాథ్ కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

2022 సంవ‌త్స‌రానికి ప‌లువురికి పుర‌స్కారాలు

K Viswanath : ఈ ఏడాది 2022 సంవ‌త్స‌రానికి గాను వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల గ్ర‌హీత‌ల‌ను ప్ర‌క‌టించింది హైప‌ర్ స్క్రీనింగ్ క‌మిటీ. తెలుగు సినిమా రంగంలో దిగ్గజ ద‌ర్శ‌కుడు క‌ళాత‌ప‌స్వి కాశీనాథుని విశ్వ‌నాథ్(K Viswanath) కు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ల‌భించింది.

న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆర్. నారాయ‌ణ‌మూర్తికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ద‌క్కింది. నవంబ‌ర్ 1న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ అవార్డుల‌ను గ్ర‌హీత‌ల‌కు అంద‌జేయ‌నున్నారు.

జీవితకాల సాఫ‌ల్య పుర‌స్కారం మాజీ సీఎం దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంస్య విగ్ర‌హంతో పాటు ప్ర‌శాంసా ప‌త్రం, జ్ఞాపిక, రూ. 10 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేస్తుంది. ఇక అచీవ్ మెంట్ అవార్డు కింద రూ. 5 ల‌క్ష‌ల న‌గ‌దు, జ్ఞాపిక‌, ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేస్తారు. ఇక ఆయా కేట‌గిరీల‌కు సంబంధించి వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు 25 మందిని ఎంపిక చేసింది క‌మిటీ.

ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా దివంగ‌త సీఎం డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి(YS Rajasekar Reddy) పేరు మీద వివిధ రంగాల‌లో నిష్ణాతులు, ప్ర‌ముఖులు, అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తుల‌ను ఎంపిక చేస్తుంది వైఎస్సార్ ఎంపిక క‌మిటీ. గ‌తంలో ప్ర‌భుత్వ ప‌రంగా నంది అవార్డుల‌ను ఇచ్చే వారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొలువు తీరాక కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

సినీ రంగానికి సంబంధించి క‌ళాత్మ‌కమైన సినిమాలు తీయ‌డంలో పేరు పొందారు కె. విశ్వ‌నాథ్(K Viswanath). ఇక విప్ల‌వ చిత్రాల‌ను తీయ‌డంలో పేరొందారు నారాయ‌ణ‌మూర్తి. వీరిద్ద‌రికి అవార్డులు ద‌క్క‌డం ప‌ట్ల సినీ రంగానికి చెందిన వారు సంతోషం వ్య‌క్తం చేశారు.

Also Read : వైఎస్సార్-2022 పుర‌స్కార గ్ర‌హీత‌లు వీరే

Leave A Reply

Your Email Id will not be published!