Kalava Srinivasulu : చంద్ర‌బాబు విడుద‌ల‌య్యే దాకా దీక్ష

మాజీ మంత్రి కాలువ శ్రీ‌నివాసులు

Kalava Srinivasulu : అనంత‌పురం – మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు కాలువ శ్రీ‌నివాసులు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బాబు అరెస్ట్ ను నిర‌సిస్తూ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు.

Kalava Srinivasulu Serious Comments on AP Govt

ఈ సంద్భరంగా కాలువ శ్రీ‌నివాసులు మాట్లాడారు. చంద్ర‌బాబుపై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని, కావాల‌ని ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. వైసీపీని ఈ రాష్ట్రం నుంచి త‌రిమి కొట్టేంత దాకా తాము ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు కాలువ శ్రీ‌నివాసులు.

అక్ర‌మంగా అరెస్ట్ అయిన నారా చంద్ర‌బాబు నాయుడు జైలు నుంచి విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు తాను భోజ‌నం చేయ‌నంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు మాజీ మంత్రి(Kalava Srinivasulu). అవినీతి మ‌ర‌క అంట‌ని నాయ‌కుడ‌ని కొనియాడారు. రాయ‌దుర్గంలో ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్షకు దిగారు.

45 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఏపీ స్కిల్ స్కాం జ‌ర‌గ‌లేద‌న్నారు. రాజ‌కీయ క‌క్ష సాధింపు ధోర‌ణి త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ప్ర‌జాస్వామ్య వాదులు, మేధావులు అర్థం చేసుకోవాల‌ని, త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Also Read : Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్ కు మైనంప‌ల్లి గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!