Kalipatnam Ramarao: కారా మాస్టారు
కారా మాస్టారుగా ప్రశిద్ధి చెందిన కాళీపట్నం రామారావు
Kalipatnam Ramarao : కాళీపట్నం రామారావు( 1924 నవంబరు 9 – 2021 జూన్ 4): ప్రముఖ తెలుగు కథా రచయిత, కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు గ్రహీత కారా మాస్టారు అని పిలుచుకునే కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన కారా మాస్టారు రచనా శైలి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా సరళంగా ఉంటుంది. తన స్నేహితుడు మరియు ప్రసిద్ధ రచయిత రావి శాస్త్రి రచనల నుండి ప్రేరణ పొంది, అతను గ్రామాలలో అణగారిన వారి జీవితాన్ని మరియు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వారి మనుగడ వ్యూహాలు మరియు పోరాటాలను మాట్లాడే అనేక తెలుగు కథలను రాశారు. తీర్పు, ఇల్లు, స్నేహం, శాంతి, కుట్ర, వీరుడు మహావీరుడు, సంకల్పం, జీవధార, ఆర్తి, చావు, హింస, ఆదివారం, యజ్ఞం వంటి కథలు రాయడానికి రావిశాస్త్రి మరియు కొడవటిగంటి కుటుంబరావు అతని కీలక ప్రేరణ.
Kalipatnam Ramarao – కారా మాస్టారు యజ్ఞం
కారా మాస్టారు చేసిన రచనలు తక్కువైనా అన్నీ సుప్రసిద్ధాలు. 1966లో ఈయన వ్రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం నుంచి పద్మ అవార్డు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మరియు గీతం విశ్వవిద్యాలయం తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను కారా మాస్టారుకు డాక్టరేట్ అందించాయి. 1980లో ఆంధ్రభూమి దినపత్రికలో కొత్త రచయితలను ప్రోత్సహించేందుకు నేటికథ కాలమ్‌ను ప్రారంభించారు.
కారా మాస్టారి “కథానిలయం”
ఉపాధ్యాయ వృత్తి నుండి రచయితగా మారిన కారా మాస్టారు నుగొండ లక్ష్మీనారాయణ మరియు రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డిల ప్రేరణతో తెలుగు కథల నిధి అయిన “కథానిలయం” ను ఏర్పాటు చేసారు. తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు(Kalipatnam Ramarao) కథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం ఈ “కథానిలయం”. కారా మాస్టారు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఎ కాలనీలో 22 ఫిబ్రవరి 1997లో కథానిలయం ప్రారంభించారు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేవారు.
తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలి అనేది కారా మాస్టారు ఆకాంక్ష. ప్రస్తుతం ఇందులో లక్షకు పైగా కథలు, 6,000 పుస్తకాలు మరియు 20,000 పత్రికలు ఉన్నాయి. సేకరణను డిజిటలైజ్ చేయాలనే కారా కల దాదాపుగా నెరవేరింది. తెలుగు అకాడెమీ కథానిలయం సహాయంతో 2005లో 2000 మంది రచయితల వివరాలను అందించి కథ కోసం (కథల నిధి)ని ప్రచురించింది. కారా మాస్టారు స్థాపించిన కథానిలయం తెలుగు సాహిత్య ప్రపంచానికి స్మారక చిహ్నాల్లో ఒకటి.
Also Read : Yandamuri Veerendranath : నవలా రచయిత