Kamal Haasan : విక్ర‌మ్ విజ‌యం క‌మ‌ల్ సంతోషం

సినిమా స‌క్సెస్ మీట్ లో కామెంట్స్

Kamal Haasan : సినిమా విష‌యంలో తాను లైట్ గా తీసుకుంటాన‌ని అన్నారు దిగ్గ‌జ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan) ప్ర‌తి సినిమాను మ‌నసు పెట్టి తీస్తాం. వంద శాతం స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటాం. ఒక్కోసారి ఆశించినంత మేర రాక పోవ‌చ్చు.

అందుకే ప్ర‌తి దానిని తాను స‌మానంగా చూస్తాన‌ని చెప్పారు. కోలీవుడ్ ద‌ర్శ‌కుడు క‌మ‌ల్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన విక్ర‌మ్ మూవీ దుమ్ము రేపుతోంది.

ఈనెల 3న విడుద‌లైంది ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా. ఏకంగా రూ. 250 కోట్లు కొల్ల‌గొట్టింది. క‌థ‌తో పాటు మూవీ మేకింగ్ , క‌మ‌ల్ , విజ‌య్ సేతు పతి, సూర్య ల న‌ట‌న జ‌నాన్ని మెస్మ‌రైజ్ అయ్యేలా చేసింది.

రాజ్ క‌మ‌ల్ ఫిలిం ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది ఈ చిత్రానికి. మూవీ స‌క్సెస్ టాక్ రావ‌డం, కాసులు కొల్ల‌గొట్ట‌డంతో చెన్నైలో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ , న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మాట్లాడారు.

ఊహించ‌ని దాని కంటే ఎక్కువ‌గా విక్ర‌మ్ ను ఆద‌రించారు. ఇంత గొప్ప విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌క దేవుళ్ల‌కు న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని అన్నారు. మంచి విజ‌యం సాధించాను, ఇక చాలు అన్న దానిని తాను ఒప్పుకోన‌న్నారు క‌మ‌ల్ హాస‌న్.

ఇదిలా ఉండ‌గా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ తో క‌లిసి న‌టిస్తారా అన్న ప్ర‌శ్న‌కు క‌థ న‌చ్చితే తాను చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో తాను న‌టించిన ప‌లు సినిమాలు దేశాన్ని ఊపేశామ‌న్నారు. అందులో ఏక్ దూజే కే లియే అని పేర్కొన్నారు.

Also Read : విద్వేష ప్ర‌చారం దేశానికి ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!