Kamal Haasan Rahul Yatra : రాహుల్ యాత్రలో లోకనాయకుడు
దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలి
Kamal Haasan Rahul Yatra : ఈ దేశంలో తమిళులు ఎక్కడున్నా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాలని ఇప్పటికే పిలుపునిచ్చిన లోక నాయకుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ఉన్నట్టుండి దేశ రాజధానిలో ప్రత్యక్షమయ్యారు. దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలనే నినాదంతో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో లోక నాయకుడు పాల్గొన్నారు.
హస్తిన వేలాది మందితో నిండి పోయింది. ఎక్కడ చూసినా రాహుల్ గాంధీకి మద్దతు లభించింది. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కమల్ హాసన్(Kamal Haasan) రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీలో అడుగులో అడుగులు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాలలో పూర్తయింది రాహుల్ చేపట్టిన యాత్ర.
శనివారం డిసెంబర్ 24న ఢిల్లీకి చేరుకుంది. అంతకు ముందు సెప్టెంబర్ 6న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. సదరు యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , హర్యానా రాష్ట్రాలలో పూర్తి చేసుకుంది.
ఇప్పటి వరకు రాహుల్ గాంధీ 100 రోజుల పాటు పూర్తయింది. కమల్ హాసన్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తన వాయిస్ ను వినిపిస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ యాత్ర కాశ్మీర్ వరకు కొనసాగనుంది. 12 రాష్ట్రాలను కవర్ చేయనున్నారు రాహుల్ గాంధీ.
ఇవాళ్టి యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కమల్ హాసన్ , రాబర్ట్ వాద్రా , మనవరాళ్లు కూడా రాహుల్ తో కలిసి నడవడం విశేషం.
Also Read : రాహుల్ యాత్రలో పాల్గొనండి – కమల్