Kamal Haasan : తమిళ భాషకు అడ్డు పడితే యుద్ధమే
హెచ్చరించిన నటుడు కమల్ హాసన్
Kamal Haasan : హిందీ భాషా వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాద్దాంతానికి దారి తీశాయి.
ఇంగ్లీష్ లో కాకుండా దేశ వ్యాప్తంగా హిందీలోనే మాట్లాడాలని, ఒకే దేశం ఒకే భాష ఒకే నినాదం ఒకే ప్రభుత్వం ఉండాలన్నది తమ అభిమతమని ముందు నుంచీ భారతీయ జనతా పార్టీ చెబుతూ వస్తోంది.
ఆ దిశగా పావులు కదుపుతోంది. దీనిని చాలా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రధానంగా తమిళనాడు భగ్గుమంది. సీఎం ఎంకే స్టాలిన్ అమిత్ షాపై, కేంద్రంపై నిప్పులు చెరిగారు.
దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తమిళ భాష మధురమని పేర్కొన్నారు. ఇదే సమయంలో తమిళ జాతీయ కవి రాసిన కావ్యంలోని ఫంక్తుల్ని ఉదహరించారు.
అంతే కాకుండా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సైతం తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని, ఇంకొకరి పెత్తనం సహించ బోమని హెచ్చరించారు.
ఇదే సమయంలో కన్నడ నాట మాజీ సీఎంలు సిద్దరామయ్య, కుమార స్వామి ఫైర్ అయ్యారు. దేశంలో అత్యంత ప్రాచీనమైన భాష కన్నడేనని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) సంచలన కామెంట్స్ చేశారు. హిందీకి తాను వ్యతిరేకిని కానని అంటూనే తమిళ భాష కు అడ్డు పడితే ఊరుకోనని హెచ్చరించారు.
తమిళ భాష వర్దిల్లాంటూ పిలుపునిచ్చారు. తాను నటించిన విక్రమ్ మూవీ జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Also Read : జానీ డెప్ తాగితే రాక్షసుడవుతాడు