Kamal Haasan : ప్రస్తుత పరిస్థితుల్లో యాత్ర అవసరం
నటుడు కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్
Kamal Haasan : ఈ దేశం తీవ్రమైన సమస్యలలో కొట్టు మిట్టాడుతోంది. ఈ తరుణంలో దేశానికి కావాల్సింది ద్వేషం కాదు మనుషుల్ని మనుషులుగా చూసే వాతావరణం ఉండాలని స్పష్టం చేశారు ప్రముఖ నటుడు కమల్ హాసన్ . శనివారం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకుంది.
ఈ సందర్భంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్ తో పాటు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్డ్ వేదికగా జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ తో పాటు కమల్ హాసన్(Kamal Haasan)ప్రసంగించారు.
ప్రస్తుతం దేశం తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటోందన్నారు కమల్ హాసన్. తాను భారతీయుడిగా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నానని చెప్పారు. గెలుపు ఓటములు పక్కన పెడితే సమస్యలు పట్టించు కోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఇప్పటి వరకు 2,800 కిలోమీటర్లకు పైగా యాత్ర చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు కమల్ హాసన్ .
ఓ వైపు చలి ఇబ్బందికి గురి చేసినా రాహుల్ గాంధీ పట్టువదలని విక్రమార్కుడి లాగా చేపట్టడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. అందుకే తాను ఒక ఇండియన్ గా బాధ్యతగా భావించి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నానని చెప్పారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు. ప్రతి రోజూ ద్వేషాన్ని నిరంతరం వ్యాప్తి చెందేలా చేయడంలో భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
Also Read : రాహుల్ యాత్రలో పాల్గొనండి – కమల్